ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే నాయకుడిలోని బలం అంతగా బైటికొస్తుంది. రాజకీయాలకే కాదు.. సినిమాలకు కూడా ఇది బాగా వర్తిస్తుంది. విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది. అందులోనూ బాలకృష్ణ లాంటి హై ఎనర్జిటిక్ హీరోకి విలన్ అంటే ఎలా ఉండాలి! అందుకే ఈమధ్య ఆయన సినిమాల్లో విలన్ల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు దర్శకులు.
నిజానికి బాలకృష్ణ సినిమాల్లో విలన్లు ఎప్పుడూ బలంగానే ఉంటారు. అయితే ఈమధ్య హీరోగా ఆయన తన శైలిని కాస్త మార్చుకున్నట్టే.. ఆయన సినిమాల్లోని విలన్లకి కూడా విలక్షణ శైలి ఉండేలా చూస్తున్నారు మేకర్స్. ఉదాహరణకి గత సినిమాలో శ్రీకాంత్. అప్పుడప్పుడు నెగిటివ్ రోల్స్ చేసినా.. శ్రీకాంత్ నుంచి ఇంత భయంకరమైన విలన్‌ని బయటికి తీయవచ్చనేది ఊహించని విషయం. అతనిని నెటివివ్ పాత్రలో బోయపాటి ఎలివేట్ చేసిన తీరు మామూలుగా లేదు. బాలయ్య పర్సనాలిటీకి, అగ్రెషన్‌కి ఏమాత్రం తీసిపోకుండా పోటాపోటీగా నిలిచి మెప్పించాడు శ్రీకాంత్.
బాలయ్య నెక్స్ట్ సినిమా విషయంలోనూ విలన్ పాత్రపై ప్రత్యేక దృష్టి ఉంది. అందుకే ఆయనతో పోరాడటానికి కన్నడ సీమ నుంచి దునియా విజయ్‌ని దింపుతున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. నిన్ననే సెట్‌లో కూడా జాయినయ్యాడు తను. ముద్దుగా ఇతన్ని విజి అని పిలుస్తుంటారంతా. మనవాళ్లకి తన గురించి అంతగా తెలియదు కానీ కన్నడిగులకి మాత్రం బాగా తెలుసు. ఇప్పటికే తన పర్‌ఫార్మెన్స్‌తో శాండిల్‌వుడ్ ప్రేక్షకుల మనసులు దోచేశాడు విజయ్. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయాడు.
తన సినిమాలు చూసినవాళ్లు ఎవరైనా చెప్పగలరు.. బాలకృష్ణకి పర్‌ఫెక్ట్ విలన్ అవుతాడని. గోపీచంద్ కూడా విలన్లకు డిఫరెంట్ క్యారెక్టరయిజేషన్ ప్లాన్ చేస్తుంటాడు. మరి విజయ్‌ని ఎలా తయారు చేస్తాడో చూడాలి. పైగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా కీలక పాత్ర చేస్తోందని ప్రకటించారు. తనది కూడా నెగిటివ్ రోల్ అని టాక్. అదే నిజమైతే పోరు మామూలుగా ఉండదు. ఎందుకంటే విలనీని ప్రదర్శించడంలో వరలక్ష్మి ముందు మేల్ యాక్టర్స్ కూడా తేలిపోతారు. కాబట్టి ఆమె విలన్ అయితే మామూలుగా ఉండదు. అయినా బాలయ్యకి విలన్‌గా నటించాలంటే ఈ రేంజ్ యాక్టర్స్ ఉండాలి మరి!
This post was last modified on March 8, 2022 4:34 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…