టికెట్ల రేట్లు తగ్గించడం ద్వారా దాదాపు ఏడాది పాటు సినీ పరిశ్రమను ఇరుకున పెట్టి వినోదం చూసిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎట్టకేలకు జీవో నంబర్ 35ను ఉపసంహరించుకుని.. టికెట్ల ధరలు పెంచుతూ కొత్త జీవోను ఇచ్చింది. మామూలుగా టికెట్ల ధరలు పెంచడం వరకు బాగానే ఉంది కానీ.. ఐదో షో, అలాగే పెద్ద సినిమాలకు పది రోజుల వరకు సాధారణ రేట్ల మీద ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించడం లాంటి విషయాల్లో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్దేశపూర్వకంగా వీటి విషయంలో కొన్ని మెలికలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఐదో షోకు అనుమతి ఇస్తూనే.. ఒక షోను చిన్న సినిమాకు కేటాయించాల్సిందిగా పేర్కొంది ప్రభుత్వం. కానీ ఐదో షో అనేది పెద్ద సినిమాలకు మాత్రమే అడ్వాంటేజ్. తొలి వీకెండ్లో హైప్‌కు తగ్గట్లుగా వీలైనన్ని ఎక్కువ షోలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వాటికి మాత్రమే ఐదో షో ఉపయోగపడుతుంది.
ఏపీలో బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉండగా.. చిన్న సినిమాలకు ప్రస్తుతం స్క్రీన్లు దొరకని పరిస్థితేమీ లేదు. వాటికి ఆక్యుపెన్సీ రావడమే కష్టమవుతోంది. చాలా సినిమాలకు మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాని పరిస్థితి తలెత్తింది. ఇక పెద్ద సినిమాలు రిలీజైనపుడు వాటికి పోటీగా చిన్న సినిమాలు రిలీజే చేయరు. పండుగ సీజన్లలో వాటికి స్కోపే ఉండదు. అలాంటపుడు ఐదో షోను చిన్న సినిమాకు ఎలా కేటాయించగలుగుతారు. డిమాండ్ ఉన్న పెద్ద సినిమాకు అదనపు షో అవసరం కానీ.. ఆ టైంలో చిన్న సినిమాను ప్రదర్శించమంటే ఎవరు ఆ ఛాన్స్ తీసుకుంటారన్నది ప్రశ్న. ఇక పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకునే విషయంలోనూ ఒక మెలిక ఉంది.
పారితోషకాలు కాకుండా బడ్జెట్ రూ.100 కోట్లు దాటి ఉండాలట. 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగి ఉండాలట. కానీ ఇలాంటి సినిమాలు చాలా అరుదు. అసలు పారితోషకాలు కాకుండా బడ్జెట్ 100 కోట్లని, 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగిందని నిర్ధారించేదెవరు? ఈ విషయంలో లాబీయింగ్ జరగడానికి ఛాన్సుంది. తమకు నచ్చని హీరోల సినిమాలు వచ్చినపుడు ఐదో షో విషయంలో, టికెట్ల రేట్ల పెంపు విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేసి వాటికి అవకాశం లేకుండా చూడటం, మిగతా సినిమాలకు మాత్రం చూసీ చూడనట్లు వదిలేయడం జరగడం గ్యారెంటీ. తద్వారా ఇండస్ట్రీ జనాలు తమ ముందు అణిగిమణిగి ఉండేలా చూసేందుకే ఇలాంటి మెలికలు పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on March 8, 2022 12:53 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…