రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీని యాక్టివేట్ చేయాలని డిసైడ్ చేశారు. ఎన్నికలకు ఉన్న రెండేళ్ల కాలాన్ని మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు జనాల్లోనే తిరగాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. జూలైలో పార్టీ ప్లీనరీని నిర్వహించబోతున్నట్లు జగన్ చెప్పారు. 2017లో వైజాగ్ లో ప్లీనరీ జరిగిన విషయం తెలిసిందే.
అంటే ఐదేళ్ల నుంచి పార్టీ ప్లీనరీ జరగలేదు. ఇదే విషయం పార్టీ నేతల మధ్య చర్చ కూడా జరుగుతోంది. జగన్ పార్టీకి సమయం కేటాయించటం లేదని, ఎంఎల్ఏలకు సరైన సమయం ఇవ్వటం లేదని పార్టీలోనే అసంతృప్తి ఉంది. బహుశా జగన్ దృష్టికి ఈ విషయాలన్నీ వెళ్ళుంటాయి. అందుకనే మంత్రులందరు వారంలో మూడు రోజులు పార్టీకి కేటాయించాలని చెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలందరు పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు.
మంత్రులు, ఎంఎల్ఏలు రెగ్యులర్ గా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని జనాలకు వివరించాలని చెప్పారు. అలాగే ఏప్రిల్లో ప్రభుత్వం తరపున పనిచేస్తున్న వాలంటీర్లందరికీ సన్మానం చేయాలని ఆదేశించారు. వాలంటీర్ల వ్యవస్ధ చాలా పటిష్టంగా పనిచేస్తోందని జగన్ అభినందించారు. అభివృద్ధి పనుల కోసమే ప్రతి నియోజకవర్గానికి రు. 2 కోట్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జగన్ చెప్పారు.
మంత్రులు, ఎంఎల్ఏలు ఒక క్యాలెండర్ ను రెడీ చేసుకుని దాని ప్రకారమే గ్రామాలు, మండలాల్లో పర్యటించాలని ఆదేశించారు. మంత్రులు, ఎంఎల్ఏలు ఇంటింటికి వెళ్ళి జనాలను పలకరించాలని కూడా చెప్పారు. మొత్తానికి జగన్ చెప్పిన మాటలు చూస్తుంటే రాబోయే ఎన్నికలకు మంత్రులు, ఎంఎల్ఏలను ఫుల్లుగా ప్రిపేర్ చేస్తున్నట్లే ఉంది. ఇదే సమయంలో పార్టీకి జగన్ తగిన సమయం కేటాయించలేదనే అసంతృప్తిని తొలగించాలని కూడా అనుకున్నట్లున్నారు. అందుకనే ప్లానరీ అని, శాసనసభాపక్ష సమావేశమని, ఎంఎల్ఏలతో తరచు సమావేశాలని జగన్ చెప్పింది.
This post was last modified on March 8, 2022 11:27 am
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…