రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లు గరిష్ఠం రూ.250, కనిష్ఠం రూ.20 గా నిర్ధారించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా బడ్జెట్ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుంద ని జీవోలో పేర్కొంది. మరోవైపు.. రాష్ట్రంలో సినిమాలు చిత్రీకరిస్తే.. మరో 10 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రతి సినిమా హాల్లోనూ 25 శాతం సీట్లను నాన్‌ప్రీమియం కు కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవొ జారీ చేసింది. దీని ప్రకారం.. మూడు రకాలుగా టికెట్ల రేటును నిర్ణయించింది.
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు
నగర పంచాయతీల్లో
నాన్ ఏసీ- కనిష్ఠం ధర రూ.20
ఏసీ థియేటర్లు కనిష్ఠ ధర రూ.50
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం రూ.70
మల్టీప్లెక్స్‌ల్లో ధర రూ.100, రూ.250
—————————-
మున్సిపాలిటీల్లో
నాన్ ఏసీ- కనిష్ఠ ధర రూ.30
ఏసీ థియేటర్లు- కనిష్ఠ ధర రూ.60
స్పెషల్ థియేటర్లు కనిష్ఠ ధర రూ. 80
మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర రూ.125, రూ.250
——————————
మున్సిపల్ కార్పొరేషన్లలో
నాన్ ఏసీ- కనిష్ఠ ధర రూ.40
ఏసీ థియేటర్లు కనిష్ఠ రూ.70
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం రూ.100
మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర రూ.150, రూ. 250
This post was last modified on March 7, 2022 9:36 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…