టాలీవుడ్ స్టార్లలో అత్యంత సరదాగా ఉండే వ్యక్తిగా ప్రభాస్‌ను చెబుతుంటారు. అతను ‘బాహుబలి’కి ముందు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే కనిపిస్తున్నాడు. కొందరు స్టార్ల లాగా తెచ్చిపెట్టుకున్న అహం అతడిలో కనిపించదు. సినిమా ఈవెంట్లలో.. అలాగే మీడియాను కలిసినపుడు కూడా ప్రభాస్ చాలా సింపుల‌్‌గా కనిపిస్తాడు. సరదాగా మాట్లాడతాడు. ఇటీవల ముంబయిలో ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లకు వెళ్లినపుడు మీడియా వాళ్లు ఎదురుగా ఉండగానే దర్శకుడు రాధాకృష్ణకుమార్‌తో సాగించిన సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.
‘‘నీకు హిందీ వచ్చా.. ఐతే మాట్లాడేసేయ్.. నేను బాగా ప్రాక్టీస్ చేసి ‘ఆదిపురుష్’ టైంలో మాట్లాడతా’’ అని రాధాకృష్ణను ఉద్దేశించి అనడం రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్లోనూ ప్రభాస్ తన చమత్కారాన్ని చూపించాడు. ‘రాధేశ్యామ్’లో ప్రేమకు, విధికి మధ్య జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు ప్రోమోల్లో చూపిస్తున్న సంగతి తెలిసిందే. పోస్టర్ల మీదా ఇదే మాట కనిపిస్తోంది.
ఐతే చెన్నై రిపోర్టర్ ఒకరు దీని గురించి ప్రస్తావిస్తూ.. ఇంతకీ సినిమాలో ప్రేమ గెలిచిందా, విధి గెలిచిందా అని ప్రభాస్‌ను ప్రశ్నించాడు. దానికి ప్రభాస్ నవ్వుతూ.. ‘‘ఆ ప్రశ్నకు ఇప్పుడే జవాబు చెప్పేయమంటారేంటి? కనీసం ఒక 50 రూపాయలైనా పెట్టి సినిమా చూసి ఆ సంగతి తెలుసుకోండి.
మా ప్రొడ్యూసర్లు ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి థియేటరుకెళ్లి సినిమా చూడకుండా ఆ విషయం తెలుసుకోవాలంటే ఎలా’’ అని ప్రభాస్ అనడంతో అందరిలోనూ నవ్వులు పూశాయి. మొత్తానికి ఈ ప్రశ్నకు జవాబిచ్చే క్రమంలో ‘రాధేశ్యామ్’ బడ్జెట్ ఎంత అన్నది కూడా ప్రభాస్ చెప్పేశాడు. ఇప్పటిదాకా ‘రాధేశ్యామ్’ బడ్జెట్ రూ.200 కోట్ల లోపే అనుకుంటున్నారంతా. ఈ ప్రేమకథా చిత్రానికి కూడా రూ.300 కోట్లు పెట్టారంటే ప్రభాస్ రేంజేంటన్నది అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 5, 2022 1:53 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…