ఆకాశమే నీ హద్దురా సినిమాకి ముందు సూర్య పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒకటా రెండా.. వరుసగా ఎన్నో ఫెయిల్యూర్స్. స్టార్ హీరో, మంచి యాక్టర్.. అయినా తన సినిమా వస్తోందంటే ఈసారైనా హిట్టు కొడతాడా అంటూ సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది. ఆకాశమే నీ హద్దురాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు కూడా తనకి అదే బెటర్‌లే, కనీసం పెట్టిన డబ్బులైనా వస్తాయి అని కొందరు నవ్వారు.
కానీ డిజిటల్‌గా రిలీజయ్యి కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోవచ్చని ఆ సినిమాతో ప్రూవ్ చేశాడు సూర్య. ఆ తర్వాత ‘జై భీమ్’ మూవీతో మరో ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. కమర్షియల్ అంశాలకి దూరంగా, వాస్తవాలకి దగ్గరగా తీసిన ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదలయ్యింది. హిట్టు కొట్టడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే సూర్యనే చేయాలి అనేంతగా మెప్పు పొందింది.
ఇప్పుడు ఈ సక్సెస్ రేట్‌ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత సూర్య మీదే ఉంది. తను వేసే అడుగులే దాన్ని నిర్ణయిస్తాయి. త్వరలో ‘ఈటీ’ అనే మూవీతో రాబోతున్నాడు సూర్య. ఇది పక్కా కమర్షియల్ సినిమానే అని టీజర్లు, ట్రైలర్ల ద్వారా అర్థమవుతోంది. అయితే దీని తర్వాత బాల, వెట్రిమారన్‌ల డైరెక్షన్‌లో సినిమాలు చేయబోతున్నాడు సూర్య. ఈ రెండింటికీ ఒకేసారి పని చేయబోతున్నాడు.
వెట్రిమారన్ సినిమా గురించి ఇంకా తెలియలేదు కానీ.. బాల సినిమాతో మరో ప్రయోగం చేయబోతున్నాడు సూర్య. ఇందులో డ్యూయెల్ రోల్ చేయనున్నాడు. వాటిలో ఒకటి చెవిటి, మూగ పాత్ర అని తెలుస్తోంది. ఓ పాత్రకి జోడీగా జ్యోతిక నటించనుంది. వీళ్లిద్దరూ కలిసి పదహారేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విషయం. అయితే రా స్టోరీస్, రస్టిక్ క్యారెక్టర్స్‌తో సినిమా చేయడం బాల స్టైల్. పైగా కమర్షియల్ సక్సెస్‌ల కంటే అవార్డులు రాబట్టే చిత్రాలే ఎక్కువ ఉన్నాయి తన కెరీర్ గ్రాఫ్‌లో.
అదే ఇప్పుడు సూర్య ఫ్యాన్స్‌ని కంగారు పెడుతోంది. ఎంత ప్రయోగాలు చేసినా మరీ బ్లైండ్‌గా వెళ్తే మళ్లీ ఫెయిల్యూర్స్ వస్తాయేమోనని కంగారు పడుతున్నారు. ‘ఈటీ’లోనూ మంచి సబ్జెక్ట్ ఉంది. ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసేవాడికి ఎదురు తిరిగి పోరాడతాడు సూర్య. దాన్నే కమర్షియల్ ఫార్మాట్ మిస్సవుకుండా తీశానంటున్నాడు పాండిరాజ్. దాంతో ఈ సినిమా విషయంలో అభిమానులకు భయం లేదు. కానీ బాల సినిమా అనగానే కమర్షియల్‌గా వర్కవుటవుతుందో లేదోననే డైలమాలో పడ్డారు. కాస్త ఆచి తూచి ఆలోచించి అడుగేయడం మంచిదని తమ ఫేవరేట్ హీరోకి సలహా ఇస్తున్నారు.
This post was last modified on March 5, 2022 1:23 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…