తాను క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయినా తన కొడుకు మాత్రం మంచి హీరో కావాలని ఆశపడ్డారు సాయికుమార్. తండ్రి ప్రోత్సాహంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది. మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాతి నుంచి అదృష్టం అతనితో దోబూచులాడుతోంది.
సక్సెస్ అతని దగ్గరకు రాకుండా ఇబ్బంది పెడుతూనే ఉంది. అయినా కూడా తగ్గేదే లే అంటూ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. నిజానికి ఆది చాలా కష్టపడతాడు. బాగా నటిస్తాడు. చక్కని డ్యాన్సర్ కూడా. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. లక్ చేతికి చిక్కనంటోంది.
కెరీర్ డల్‌గానే ఉంటోంది. అలాగని అవకాశాలు లేవా అంటే.. కొందరు సక్సెస్‌ఫుల్ హీరోలకి కూడా లేనన్ని ఆఫర్స్ ఉన్నాయి ఆదికి. ప్రస్తుతం ఒకటీ రెండూ కాదు.. తీస్‌మార్ ఖాన్, కిరాతక, బ్లాక్, అమరన్ ఇన్ ద సిటీ, సీఎస్‌ఐ సనాతన్, జంగిల్ అంటూ ఆరు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమాని మొదలుపెట్టాడు.
కెకె రాధామోహన్ నిర్మాణంలో ఓ కొత్త సినిమాకి కమిటయ్యాడు ఆది. ఈ చిత్రంతో ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ధృవన్ సంగీతం అందిస్తున్నాడు. ముత్యాల సతీష్ సినిమాటోగ్రాఫర్. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, అందరికీ నచ్చుతుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. దీంతో కలిసి ఏడు సినిమాలయ్యాయి. వీటిలో ఒక్కటైనా ఆది కెరీర్‌ని మలుపు తిప్పుతుందేమో చూడాలి.
This post was last modified on March 5, 2022 6:38 am
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…