బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ని వెండితెరపై చూసి నాలుగేళ్లు అయ్యింది. ‘జీరో’ సినిమా కొట్టిన దెబ్బ నుంచి కోలుకోడానికి పాపం ఇన్నేళ్లు పట్టింది కింగ్ ఖాన్‌కి. కొన్నాళ్లు అసలు సినిమాల జోలికి పోలేదు. ఆ తర్వాత కూడా ఎంతో ఆలోచించి, ఆచితూచి అడుగులేయాలని డిసైడయ్యాడు. సక్సెస్ ఫార్ములా బాగా తెలిసిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ మూవీ చేయడానికి ఎస్ చెప్పాడు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ని ప్రకటించి ఫ్యాన్స్ని సంతోషంలో ముంచేశాడు.
వచ్చే యేడు జనవరి 25న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ‘పఠాన్’ విడుదల కానుందని అనౌన్స్ చేశాడు షారుఖ్. ఈ సందర్భంగా ఓ టీజర్‌ని కూడా వదిలాడు. ఇందులో షారుఖ్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. స్టైలిష్‌గా, మ్యాన్‌లీగా ఉన్నాడు. అలాగే టీజర్‌ని బట్టి ఇదో దేశభక్తి సినిమా అని అర్థమవుతోంది. దేశం కోసం పోరాడేవాడిగా షారుఖ్ కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చింది. అందుకే ఈ మూవీ కోసం రిపబ్లిక్ డే స్లాట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు.
అలా అని తనని స్క్రీన్ మీద చూడటానికి వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలా అని అభిమానులు నిరాశపడాల్సిన పని లేదు. ఎందుకంటే మాధవన్ నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘రాకెట్రీ, ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చద్ధా’, రణ్బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు షారుఖ్. ఈ మూడు సినిమాలూ ఈ యేడే విడుదలవుతాయి. అంటే ఓ మూడుసార్లు తెరపై మెరిసి మురిపిస్తాడు షారుఖ్. ఒకవేళ సల్మాన్ ‘టైగర్ 3’ కూడా ఈ సంవత్సరమే విడుదలైతే నాలుగోసారి కూడా కనిపిస్తాడు. అందులోనూ అతిథిగా నటిస్తున్నాడు మరి.
అయితే తనని హీరోగా చూడాలంటే మాత్రం వచ్చే జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహామ్ విలన్‌గా నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు అట్లీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు షారుఖ్. నయనతార హీరోయిన్. ప్రియమణి, సాన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
This post was last modified on March 2, 2022 4:44 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…