భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన లీడ్ రోల్ అభిమానులు సహా అందరినీ బాగానే ఆకట్టుకుంది. పవన్ ఇప్పటిదాకా చేసిన పాత్రలన్నింట్లోనూ ఇది ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ పాత్ర నేపథ్యం.. అది ప్రవర్తించే తీరు కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్ర మలయాళ మాతృక ‘అయ్యప్పనుం కోషీయుం’లో బిజు మీనన్ చేసిన పాత్ర అది. ఒరిజినల్లో బిజు తన స్టయిల్లో, అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఒక స్టయిల్లో ఆ పాత్రను చేయగా.. పవన్ తన శైలిలో, మన ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లుగా ఆ క్యారెక్టర్ని పండించాడు.
మాతృకతో పోలిస్తే ఈ పాత్రను తెలుగులో మరింతగా మాస్‌గా తీర్చిదిద్ది మంచి ఎలివేషన్లు ఇచ్చారు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ చంద్ర. రైటర్‌గా త్రివిక్రమ్ మార్పులు చేర్పులు, మాటల విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. భీమ్లా పాత్రకు సంబంధించి మాతృకతో పోలిస్తే జరిగిన కీలక మార్పు.. కొక్కిలి దేవర పట్టు. భీమ్లాకు బాగా కోపం వస్తే.. అవతలి వ్యక్తిని కింద పడేసి భుజం మీద కాలు వేసి తొక్కుతూ చేతిని పట్టి లాగడం ఒక మేనరిజం లాగా చూపించారు.
ఫ్లాష్ బ్యాక్‌లో ఇలాగే ఒక రౌడీని తొక్కి పట్టి అతడి చేతిని విరిచేస్తాడు. వర్తమానంలో డానియల్ శేఖర్ మీద రెండుసార్లు ఇలాగే ప్రతాపం చూపిస్తాడు. సదరు సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఐతే మాతృకలో ఈ సన్నివేశాలు ఇలా ఉండవు. అందులో బిజు వెనుక నుంచి ఉడుంపట్టు పట్టినట్లు చూపిస్తారు. మహాభారతంలో ధృతరాష్ట్ర కౌగిలి అనే కాన్సెప్ట్ స్ఫూర్తితో ఆ సన్నివేశాలు రూపొందించారు.
ఐతే దీన్ని తెలుగులో అలాగే దించేయకుండా.. రామాయణ పురాణ గాథలోకి వెళ్లాడు త్రివిక్రమ్. అందులో వాలి-సుగ్రీవుల మధ్య పోరాటానికి సంబంధించిన ఓ దృశ్యం చూస్తే.. భీమ్లా ప్రతాపానికి దగ్గరగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఇలా పురాణాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ‘అజ్ఞాతవాసి’లో నకుల ధర్మం గురించి చూపించిన మాటల మాంత్రికుడు ఇప్పుడు వాలి-సుగ్రీవుల పోరు స్ఫూర్తితో ‘భీమ్లా నాయక్’లో సన్నివేశాలను భలే తీర్చిద్దాడంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on March 2, 2022 10:25 am
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…