బాలీవుడ్‌లో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెంచిన నటి విద్యాబాలన్. కహానీ, డర్టీ పిక్చర్, తుమ్హారీ సులు లాంచి చిత్రాలతో సత్తా చాటింది. హీరోతో పని లేదని, హీరోయిన్ కోసం కూడా ప్రేక్షకులు సినిమాలు చూస్తారని ప్రూవ్ చేసింది. బలమైన కథలు, అంతకంటే బలమైన పాత్రలు, అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌కి విద్య సినిమాలు కేరాఫ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు మరోసారి అలాంటి స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో వస్తోంది విద్య. తనతో ‘తుమ్హారీ సులు’ చిత్రాన్ని తీసిన టీమ్‌తో ‘జల్సా’ అనే సినిమా చేసింది. ఈ చిత్రాన్ని మార్చ్ 18న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ఇవాళ ప్రకటించింది. సురేష్ త్రివేణి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మ, సురేష్ త్రివేణి నిర్మించారు. షెఫాలీ షా, మానవ్ కౌల్, రోహిణి హట్టంగడి లాంటి వెర్సటైల్ యాక్టర్స్ నటించారు.
ఇటీవలి కాలంలో విద్య నటించిన సినిమాలన్నీ డిజిటల్ బాటే పడుతున్నాయి. గత రెండు చిత్రాలూ ఓటీటీలోనే విడుదలయ్యాయి. ప్రపంచమే మెచ్చిన మ్యాథమెటీషియన్ శకుంతలా దేవి జీవితం ఆధారంగా తీసిన సినిమా డిజిటల్‌గానే రిలీజయ్యింది. అలాగే విద్య ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటించిన ‘షేర్నీ’ కూడా ఓటీటీలోనే విడుదలయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే వస్తోంది.
విద్యకి, ఆమె సినిమాలకి డిమాండ్ ఉండటంతో ఓటీటీలు మంచి రేటు చెల్లించి తన సినిమాలు కొంటున్నాయి. థియేటర్లు, రిలీజుల విషయంలో కన్‌ఫ్యూజన్ పూర్తిగా తొలగకపోవడంతో ఆమెతో సినిమాలు తీసినవాళ్లు కూడా ఓటీటీవైపే అడుగులేస్తున్నారు. ఓటీటీల సంగతి, నిర్మాతల సంగతి ఏమోగానీ.. రిలీజైన వెంటనే ఇంట్లోనే కూర్చుని విద్య సినిమాని చూసే చాన్స్ దొరుకుతున్నందుకు ప్రేక్షకులైతే హ్యాపీ.
This post was last modified on %s = human-readable time difference 5:19 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…