సౌత్‌లో సూపర్ స్పీడులో దూసుకెళ్తున్న పూజాహెగ్డే.. అటు నార్త్‌లోనూ జెండా పాతేందుకు సీరియస్‌గా ట్రై చేస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచీ పూజకి అక్కడ కూడా మంచి ఆఫర్లే వచ్చాయి. అయితే సౌత్‌లో టాప్ హీరోయిన్ అయిపోవడంతో అక్కడ తక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడు బీటౌన్‌లో కూడా బిజీ అయిపోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్‌తో పాటు సల్మాన్ ఖాన్ సరసన కూడా నటిస్తోంది పూజ. రణ్‌వీర్ సంగతేమో కానీ.. సల్మాన్ మాత్రం పూజని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతున్నాడు.
ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో పూజ టాలెంట్‌ని తెగ పొడిగేశాడు సల్మాన్. చాలా మంచి నటి అని, డెడికేషన్‌తో వర్క్ చేస్తుందని మెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి పూజ పర్‌ఫెక్ట్ యాక్ట్రెస్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు. సల్మాన్‌తో కలిసి ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మూవీలో నటిస్తోంది పూజ. అందుకే తన దబాంగ్ టూర్‌లో పూజని కూడా ఇన్‌వాల్వ్ చేశాడు సల్మాన్. అందులో భాగంగా దుబాయ్‌లో ఓ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ పూజ ఇచ్చింది. అది అందరికీ బాగా నచ్చేసింది.
దాంతో సల్మాన్ కూడా సంతోషపడిపోతున్నాడు. ఫస్ట్ టైమ్ అయినా పూజ చాలా చక్కగా డ్యాన్స్ చేసిందని, తనలాంటి మంచి నటితో కలిసి పని చేయడం హ్యాపీగా ఉందని అంటున్నాడు. సల్మాన్ ఏ హీరోయిన్ విషయంలోనైనా ఇంప్రెస్ అయ్యాడంటే తనకి వరుస అవకాశాలు ఇచ్చేస్తుంటాడు. ఇప్పుడు పూజ విషయంలోనూ అది జరగొచ్చు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అదే జరిగితే సల్మాన్‌తో పూజ మరికొన్ని సినిమాలు చేసే చాన్స్ ఉంది. బాలీవుడ్‌లో కూడా టాప్ పొజిషన్ వెళ్లే అవకాశమూ ఉంది. అదేమో గానీ.. స్టేజ్ మీద పూజతో సమానంగా డ్యాన్స్ చేయడానికి సల్మాన్ మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ వీడియోలు వైరల్ అవడంతో నెటిజన్స్ అతన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి ఆ పాటలో హీరోయిన్ నడచుకుంటూ వెళ్తుంటే, వెనుకే వెళ్తున్న సల్మాన్ ఆమె కోట్‌ని నోటితో క్యాచ్ చేసి స్టెప్ వేస్తాడు. కానీ ఇక్కడ పూజ చాలా పొట్టి డ్రెస్ వేసుకోవడంతో అలా పట్టుకోవడం సాధ్యం కాలేదు. అందుకే పర్‌ఫార్మ్ చేయలేక నవ్వేశాడు సల్మాన్. కానీ నెటిజన్స్ అవేమీ పట్టించుకోవడం లేదు. పూజ పర్‌ఫార్మెన్స్ అదిరిపోయిందంటున్నారు. పూజ పాస్ సల్మాన్ ఫెయిల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా.. ఎక్కడికి వెళ్లినా.. అందరి మనసులు దోచుకోగలనని పూజ అయితే ప్రూవ్ చేస్తోందనేది వాస్తవం.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…