మొన్నటి వరకు క్రికెటర్ల మీద బయోపిక్స్ వచ్చాయి. ఫేమస్ హీరోలు క్రికెటర్ల పాత్రలు పోషించారు. కానీ ఇప్పుడు క్రికెటర్లే మేకప్ వేసి రకరకాల పాత్రలు వేసేస్తున్నారు. ఆల్రెడీ శ్రీశాంత్ కొన్ని సినిమాల్లో నటించాడు. మరికొన్నింటిలో నటిస్తున్నాడు. హర్భజన్ సింగ్ కూడా ఓ మూవీతో హీరోగా మారాడు. ఇప్పుడు ధోని వంతు వచ్చింది.
ఆల్రెడీ ధోని ప్రధాన పాత్రలో ‘అధర్వ’ అనే గ్రాఫిక్ నవల మొదలైన సంగతి తెలిసిందే. దీని ఫస్ట్ లుక్‌ను ఆమధ్య రజనీకాంత్ విడుదల చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పుడేమో ఏకంగా రజినీకాంత్ లుక్‌లోకే మారిపోయి సర్‌ప్రైజ్ ఇచ్చాడు ధోని. నిన్న సోషల్ మీడియాలో ధోనికి సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోస్ ప్రత్యక్షమయ్యాయి. వీటిలో ధోనీని చూసి వారేవా అంటున్నారంతా.
ఖాకీ ప్యాంటు, షర్టు వేసి, మీసాలు దువ్వి బస్ కండక్టర్ గెటప్‌లో కనిపిస్తున్నాడు ధోని. అచ్చం రజినీకాంత్‌లా కనిపిస్తున్నాడు. అలాగే చూస్తున్నాడు, నడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. కళ్లజోడు కూడా రజినీ స్టైల్లోనే పెట్టి ఇంప్రెస్ చేశాడు. నటుడు కాకముందు రజినీ బస్ కండక్టర్‌గా పని చేసి సంగతి తెలిసిందే. అందుకే అలా తయారయ్యాడు ధోని. అయితే ఇదంతా ఎందుకు అనేది మాత్రం రివీల్ చేయకుండా దాచారు. ఇతను ఎవరు, ఎందుకిదంతా, త్వరలో తెలుస్తుంది అంటూ కాసేపు ఊరించారు.
దాంతో ధోని ఏదో సినిమా చేస్తున్నాడని, ఇదంతా దానికి సంబంధించినదేనని అనుకున్నారు చాలామంది. కానీ కాదు. ఇది ఐపీఎల్ ప్రమోషన్ కోసం చేసినదని తర్వాత తెలిసింది. ఏదేమైనా రజినీ లుక్‌లో ధోని కనిపించడం మాత్రం తలైవా ఫ్యాన్స్‌ని చాలా సర్‌ప్రైజ్ చేసింది. దాంతో ధోని వీడియో ఊహించినదానికంటే ఎక్కువే వైరల్ అయ్యింది. చాలామంది యాక్టర్ల కంటే ధోని బెటర్ అనే కితాబు దక్కింది.
This post was last modified on February 28, 2022 3:26 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…