ఓటీటీ బిగ్‌బాస్‌కి నాగార్జున రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

బుల్లితెర‌పై సూప‌ర్ స‌క్సెస్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌.. ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. `బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌` పేరుతో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో శ‌నివారం స‌యంత్రం 6 గంట‌ల నుంచీ అట్ట‌హాసంగా స్ట్రీమింగ్ షురూ అయింది. ఓటీటీ బిగ్‌బాస్‌కి సైతం కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

అషూ రెడ్డి, మ‌హేష్ విట్టా, ముమైత్ ఖాన్‌, అజ‌య్‌, యాంకర్‌ స్రవంతి, ఆర్జే చైతూ, అరియానా, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, శ్రీరాపాక, మోడల్‌ అనిల్‌ రాథోడ్‌, నటి మిత్ర శర్మ, తేజస్వీ, సరయు, యాంక‌ర్ శివ‌, హీరోయిన్‌ బిందు మాధవి, హ‌మిదా, అఖిల్‌ సార్థక్ ఓటీటీ బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్స్‌గా అడుగు పెట్టి.. ఎవ‌రి స్ట్రాటజీల‌తో వారు త‌గ్గేదే లే అన్న చందంగా దూసుకుపోతున్నారు.

ఇదిలా ఉంటే.. 84 రోజుల పాటు సాగే ఈ షోకు హోస్ట్ నాగార్జున పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న ప్ర‌చారం ప్ర‌కారం.. నాగార్జున ఏకంగా రూ. 8 నుంచి 9 కోట్ల‌ను అందుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఓటీటీ బిగ్‌బాస్‌కు కంటెస్టెంట్స్‌తో పాటు హోస్ట్‌కు సైతం కాస్త త‌క్కువ రెమ్యున‌రేష‌న్‌నే ఉంటుంది.

కానీ, తనదైన మార్క్ తో హౌస్ ని కంట్రోల్ చేయడం, షోని రక్తి కట్టించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవ‌డంలో నాగార్జున మ‌హా దిట్ట‌. అందుకార‌ణంగానే హాట్‌స్టార్ నిర్వాహ‌కులు నాగార్జునకు అంత మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.