టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్ కలిసి రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాచేత్ తాండన్, పరంపరా ఠాకూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాఘవుడుగా, కృతి సనన్ జానకిగా మరియు సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా కనిపించబోతున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
కానీ, ఆమిర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` సినిమా కోసం ఆదిపురుష్‌ను వాయిదా వేశారు. అయితే దీపావళి కానుకగా అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాత భూషన్ కుమార్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆదిపురుష్ విడుదల్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
భూజన్ కుమార్ మాట్లాడుతూ.. `ఆదిపురుష్` దీపావళికి విడుదల అవుతుంది అన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అసలు సినిమా రిలీజ్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటూ స్పష్టం చేశారు. దీంతో ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటూ ప్రభాస్ అభిమానులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదిపురుష్ ఏ ఏడాది చివర్లో అయినా వస్తుందా..? లేక వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతుందా..? అన్నది చూడాలి.
This post was last modified on February 28, 2022 1:38 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…