నెలల తరబడి తీశారు. వెయ్యి బైకులు వాడారు. హీరో అజిత్, విలన్ కార్తికేయ ఎన్నో రిస్కులు తీసుకున్నారు. అయినా ‘వలీమై’ అనుకున్న స్థాయిలో అయితే విజయం సాధించలేదు. అజిత్ సినిమాల ఓపెనింగ్ రోజు వచ్చే ఊపు ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు రాలేదంటే అంచనాలకు తగినట్టుగా ఉండకపోవడమే కారణమని చెప్పొచ్చు. తమిళంలో అజిత్ మేనియా కారణంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి కానీ, టాక్ మాత్రం అంతంతమాత్రమే.
ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఎవరైనా చెప్పేస్తారు.. స్క్రీన్ ప్లే దెబ్బేసిందని. నిజానికి కథ కూడా మరీ కొత్తగా ఏమీ లేదు. గ్యాంగ్స్ దోపిడీలు చేయడం, పోలీసైన హీరో వాళ్లని వేటాడటం లాంటి కథలు చాలానే వచ్చాయి. కాకపోతే తరచూ హాలీవుడ్ వాళ్లు మాత్రమే చూసే బైక్స్, వెబ్‌సైట్ ద్వారా కనెక్ట్ కావడం, టెక్నాలజీని ఉపయోగించి క్రైమ్స్ చేయడం లాంటివి మనవాళ్లకి కొత్తగా అనిపిస్తాయి.
అలాంటప్పుడు మంచి స్క్రీన్‌ప్లే కనుక కథకి తోడై ఉంటే వలీమై అనుకున్న స్థాయిలో పండేది. ఎందుకంటే అజిత్ యాక్షన్ ఇరగదీశాడనే అందరూ చెబుతున్నారు. సినిమా డల్ అయ్యిందని పెదవి విరుస్తున్నారు. అజిత్ స్థాయికి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేయలేకపోయాడంటూ వినోద్‌కి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయినా కూడా అజిత్ తన నెక్స్ట్ సినిమా అతనితోనే చేస్తుండటం కొందరు ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. ఈ చిత్రాన్ని వచ్చే వారంలో మొదలుపెట్టబోతున్నారట. అజిత్ లుక్ ఎలా ఉండబోతోందో రీసెంట్‌గా ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హింటిచ్చాడు బోనీ కపూర్. నిజానికి. ‘వలీమై’ తీస్తున్నప్పుడే అజిత్, వినోద్, బోనీల కాంబినేషన్‌లో మరో సినిమాని లాక్ చేశారు. అప్పుడంటే విపరీతమైన బజ్ ఉంది కాబట్టి ఓకే. కానీ వలీమై చూసిన తర్వాత అభిమానులు ఈ ప్రాజెక్ట్ విషయంలో కాస్త అనాసక్తి చూపిస్తున్నారు. వెంటనే తనతో ఎందుకు, వేరే ఎవరితోనైనా ఓ సినిమా చేశాక వినోద్‌తో మళ్లీ వర్క్ చేయొచ్చుగా అంటున్నారు.
వాళ్లలా అలోచించడంలో తప్పు లేదు. ఇప్పుడే ఓ మూవీ చేశారు. అది అంత ఇంటరెస్టింగ్‌గా తయారవలేదు. కాబట్టి కాస్త గ్యాప్ తీసుకుంటే ఇంకోసారి అలాంటి లోపాలు లేకుండా చూసుకునే చాన్స్ వినోద్‌కి దక్కుతుంది. అజిత్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారనేది క్లియర్‌గా తెలుసుకుని, దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ని మలచుకునే సమయం దొరుకుతుంది. ఈ యాంగిల్‌లో అజిత్ ఎందుకు ఆలోచించడం లేదు, వినోద్‌పై తనకి నమ్మకం ఉండటం వల్లనా, లేక మాట మీద నిలబడే మంచితనం వల్లనా అంటున్నారు ఫ్యాన్స్. మరి అజిత్ ఏమంటాడో!
This post was last modified on February 27, 2022 9:09 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…