బోయపాటి సినిమాలన్నీ గ్రాండ్ గా ఉంటాయి. కెమెరా… ఫ్రేమ్ చేస్తే, కనీసం పాతిక మంది ఆర్టిస్టులు కనిపిస్తారు. చిన్న పాత్రకైనా పెద్ద నటుడ్ని తీసుకురావడం, హీరోల్ని విలన్లుగా మార్చడం బోయపాటి స్టైల్. లెజెండ్‌లో జగపతిబాబుని విలన్ గా మార్చాడు. సరైనోడులో ఆది పినిశెట్టికి నెగిటీవ్‌రోల్ ఇచ్చాడు.
మాజీ హీరోల్ని సైడ్ క్యారెక్టర్లకు వాడుకోవడం బోయపాటికి బాగా ఆలవాటు. ‘తులసి’లో ఓ పాత్ర కోసం శివాజీని తీసుకున్నాడు. ‘దమ్ము’లో వేణుని ఎంపిక చేసుకుని ఆ సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. ఇప్పుడూ అంతే. బాలకృష్ణ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం యువ హీరోని ఎంచుకున్నాడు. తనే నవీన్ చంద్ర.
‘అందాల రాక్షసి’తో ఆకట్టుకున్నాడు నవీన్. అయితే ఆ తరవాత సరైన బ్రేక్ రాలేదు. ‘నేను లోకల్’ తో విలన్ పాత్రలో కనిపించాడు. హీరోగా తనకు అవకాశాలు తగ్గుతున్నాయి. ఈనేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా బాలయ్య సినిమాలో నవీన్ చంద్రకు ఓ మంచి పాత్ర పడిందని తెలుస్తోంది.
ఇదే సినిమాలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నాడని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఈలోగా నవీన్ కూడా ఫిక్సయ్యాడు. బాలయ్య – బోయపాటిలది క్రేజీ కాంబో. చిన్న చిన్న విషయాలపై కూడా బోయపాటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఏ పాత్ర విషయంలోనూ రాజీ పడడం లేదు. మున్ముందు ఇంకెంత మంది వచ్చి ఈ టీమ్ లో చేరతారో చూడాలి.
This post was last modified on June 17, 2020 11:47 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…