న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా.. తనదైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడీయన. అయితే నాని తన ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక వ్యక్తిని మాత్రం వేరే లెవల్‌లో వాడేసుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నాని తన రెండో చిత్రమైన `రైడ్`లో బాలయ్య హిట్ సాంగ్ `దంచవే మేనత్త కూతురా`ను రీమిక్స్ చేశాడు. అప్పట్లో ఈ సాంగ్ తెగ వైరల్ అవ్వడమే కాదు.. రైడ్ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. అలాగే `కృష్ణగాడి వీర ప్రేమగాథ` సినిమాలో నాని ఏకంగా బాలయ్యకు వీరాభిమానిగా నటించి నందమూరి ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాడు.
ఇక ఇప్పుడు కూడా బాలయ్యను వదిలేదే లే అని అంటున్నాడు నాని. `శ్యామ్ సింగ రాయ్`తో హిట్ ట్రాక్ ఎక్కిన నాని.. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `అంటే సుందరానికీ` అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ నజ్రియా ఫహద్ హీరోయిన్‌గా నటిస్తోంది. నదియా, హర్షవర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
అలాగే ఇందులో నాని బ్రాహ్మణ యువకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలయ్య బర్త్‌డే నాడు నాని సినిమాను రిలీజ్ చేస్తుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు, నాని సినిమా హిట్ అంటూ విడుదలకు ముందే సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
This post was last modified on February 27, 2022 1:55 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…