మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఒరిజినల్ టైటిల్లో ప్రధాన పాత్రధారుల ఇద్దరి పేర్లూ ఉన్నాయి. సినిమాలో కూడా ఇద్దరికీ సమ ప్రాధాన్యం కనిపిస్తుంది. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నట్లుగా ఏమీ ఉండదు. ఐతే బిజు మీనన్ చేసిన అయ్యప్ప పాత్ర వేసే ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఐతే తెలుగులోకి వచ్చేసరికి రీమేక్‌కు ‘భీమ్లా నాయక్’ అంటూ ఒక పాత్రను సూచించే టైటిల్ పెట్టి.. పవన్ చేసిన ఆ పాత్రకు విపరీతమైన ఎలివేషన్ ఇచ్చినట్లుగా కనిపించింది ప్రోమోలు చూస్తే.
ముందు ఈ టైటిల్ పెట్టి పవన్ లుక్సే వదలడం.. వరుసబెట్టి ఆ పాత్ర టీజర్, టైటిల్ సాంగ్ ఇలా ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వెళ్లడంతో రానా ఫ్యాన్స్ హర్టయిపోయారు. రానాకు బాగా ప్రాధాన్యం తగ్గించేస్తున్నారని.. అతను ఈ సినిమా ఒప్పుకుని తప్పు చేశాడని ఒక అభిప్రాయానికి వచ్చేశారు. రిలీజ్ ముంగిట కూడా రానా అభిమానులు నిరసన వ్యక్తం చేయడం కనిపించింది సోషల్ మీడియాలో. ఐతే ఇప్పుడు సినిమా చూసిన అందరికీ రానాకు సినిమాలో దక్కిన ప్రాధాన్యం ఏంటో అర్థమైంది. ఆ పాత్ర.. పవన్ క్యారెక్టర్‌కు ఎక్కడా తగ్గలేదు. రానా కెరీర్లోనే మైలురాయిలా నిలిచిపోయే పాత్ర ఇదని ముక్తకంఠంతో వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక రానా పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెరమీదికి అతను వస్తే చుట్టూ ఉన్న ఎవ్వరూ కనిపించని పరిస్థితి. ఆ స్థాయిలో అతను డామినేట్ చేశాడు. కొన్ని చోట్ల పవన్‌ను సైతం డామినేట్ చేసే స్థాయిలో అతను పెర్ఫామ్ చేశాడు. మహా పొడగరి అయిన రానా మామూలుగానే వేరే వాళ్లను స్క్రీన్ మీద కనిపించనివ్వడు.
ఇక బాగా పొగరున్న పాత్ర కావడం, అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ.. ఇంటెన్స్‌గా ఆ పాత్రను పెర్ఫామ్ చేయడంతో అతడి డామినేషన్ ఇంకా ఎక్కువ అయింది. ఆ మధ్య బాగా సన్నబడటం వల్ల రానా లుక్ దెబ్బ తిన్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు ఒకప్పటి బెస్ట్ లుక్ లోకి వచ్చేశాడు. దీంతో రానా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించాడు. ఇన్నాళ్లూ రానా సైడైపోతాడని ఫీలైన అభిమానులు.. సినిమా చూశాక కచ్చితంగా అభిప్రాయం మార్చుకుంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on February 26, 2022 5:15 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…