డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్

తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”. టెలివిజన్లో తెలుగు ప్రేక్షకులు కోరుకున్న స్థాయిని మించి ఊహించని వినోదాన్ని అందించిన “బిగ్ బాస్” ఇప్పుడు ఓటీటీలో కొత్త సంచలనం సృష్టించబోతోంది.

స్టార్ మా లో పరిమితమైన వ్యవధిలో వినోదాన్ని పంచి సంచలన విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు ఓటీటీ లో ప్రారంభం అవుతోంది. ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుంచి ఈ వినూత్న ప్రయత్నం అందుబాటులోకి వస్తుంది.

టెలివిజన్ లో బిగ్ బాస్ ని అద్భుతంగా నడిపించిన నవ మన్మథుడు నాగార్జున “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లోనూ బిగ్ బాస్ ని నడిపించబోతున్నారు. హౌస్ మేట్స్ మనస్తత్వాలను బట్టి, సందర్భాన్ని అనుసరించి బాలన్స్ చేసిన నాగార్జున ఇప్పుడు ఎలా డీల్ చేస్తారు అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

దానికంటే ముందు అసలు హౌస్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రం సస్పెన్స్. ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటలకు మాత్రమే అది తెలియనుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. నో కామా…  నో ఫుల్ స్టాప్…  బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్ !!

“బిగ్ బాస్” నాన్ స్టాప్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3h9CHBT

Content Produced by: Indian Clicks, LLC