ఒకప్పుడు అవకాశాలే లేక ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో సాటి హీరోయిన్లంతా అసూయపడేలా చేస్తోంది. ఓ రకంగా బాలీవుడ్‌లో తాప్సీ సెన్సేషన్ సృష్టించిందనే చెప్పొచ్చు. ఒక ఔట్ సైడర్ బీటౌన్‌లో ఇంతలా ఎదగడం చిన్న విషయం కాదు. అద్భుతమైన నటనతో అయితేనేమి, చక్కని స్టోరీ సెలెక్షన్‌తో అయితేనేమి.. కన్నుమూసి తెరిచేలోగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. బ్రేకుల్లేని బండిలా బ్యాక్ టు బ్యాక్ చాన్సెస్‌తో దూసుకుపోతోంది.
హిందీ, తెలుగు, తమిళం అన్నీ కలిసి ప్రస్తుతం తాప్సీ చేతిలో ఏడు సినిమాలున్నాయి. ఇప్పుడు ‘అఫ్వా’ మరో హిందీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సేషనల్ సబ్జెక్ట్స్‌తో సూపర్ హిట్ చిత్రాలు తీసే దర్శకుడు, నిర్మాత అనుభవ్ సిన్హా దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సుధీర్ మిశ్రా దర్శకుడు. ఇదొక ఆంథాలజీ. నాలుగు డిఫరెంట్ కథలు ఉంటాయి. ఓ కథలో తాప్సీ లీడ్ రోల్ చేయబోతోంది.
అనుభవ్‌తో ఆల్రెడీ చాలా ప్రాజెక్టులు చేసింది తాప్సీ. ఆమె నటించిన ముల్క్, థప్పడ్ సినిమాలు అనుభవ్ డైరెక్షన్‌లోనే వచ్చాయి. షూటింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తాప్సీ నటించిన ‘శాండ్‌కీ ఆంఖ్’ చిత్రాన్ని నిర్మించింది కూడా ఆయనే. ఇవన్నీ సూపర్ సక్సెస్ అవ్వడంతో వీళ్లిద్దరూ కలిస్తే మంచి సినిమాలు వస్తాయనే పేరొచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లు కలిసి వర్క్ చేయడానికి రెడీ అవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని కరోనా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నాడు అనుభవ్. ప్యాండమిక్ టైమ్‌లో తాను ఎదుర్కొన్న అనుభవాల ఆధారంగా ఈ ఆంథాలజీని ప్లాన్ చేశాడు. ఆల్రెడీ నవాజుద్దీన్ సిద్దిఖీ, భూమి పెడ్నేకర్‌లను తీసుకున్నాడు. ఇప్పుడు తాప్సీని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. మరికొంత మంది పాపులర్ స్టార్స్‌ని కూడా తీసుకోనున్నాడు. ముఖ్యంగా తాప్సీ నటించడం తనకి చాలా ఆనందంగా ఉందంటున్నాడు.
This post was last modified on February 26, 2022 8:18 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…