ఓటిటీ రిలీజ్ చేయడం ఏదో చాలా చిన్నతనం అన్నట్టు థియేటర్లు లేని ఈ సమయంలో ఓటిటీ వేదిక వాడుకుంటున్నారంటే చాలా మంది అఫెండ్ అవుతున్నారు. అనుష్క నటించిన నిశ్శబ్ధం చిత్రానికి సంబంధించి ఈ వార్తలు వస్తే ఆ టీం చాలా హర్ట్ అయింది. తమ సినిమా థియేటర్లలో మాత్రమే అంటూ నొక్కి వక్కాణించింది.
కొద్ది రోజుల క్రితం జోరు చూస్తే లాక్ డౌన్ మొత్తం ఎత్తేసి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ చేసేస్తారని భావించారు. దాంతో మరి కొద్ది రోజులు ఓపిక పడితే చాలని అనుకున్నారు. కానీ ఇప్పటి సీన్ చూస్తే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ కాకపోవచ్చు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినా కానీ జనాలు లేక వెలవెలబోతున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసినా కానీ పరిస్థితి అదే అవుతుంది. అందుకే మరోసారి నిశ్శబ్దం ఓటిటీ కథ తెరమీదకు వచ్చింది.
ఓటిటీ ద్వారా విడుదలైన పర భాషా చిత్రాలకు స్పందన అంతగా లేకపోవడంతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కాస్త దూకుడు తగ్గించాయి. ఇక్కడ డిమాండ్ తగ్గిపోయేలోగా ఈ దారిలో అయినా త్వరగా బయటపడాలని ఇప్పుడు తెలుగు నిర్మాతలు పలువురు తొందర పడుతున్నారు. అన్నీ కుదిరితే బహుశా త్వరలోనే నిశ్శబ్ధం వీడి శబ్దం మొదలవుతుంది.
This post was last modified on June 17, 2020 2:27 am
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…