ఒకప్పుడు హీరోలకి, విలన్లకి తేడా ఉండేది. అందుకే వాటిని పోషించేవారు కూడా సెపరేట్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు కొన్ని సినిమాల హీరోల పాత్రల్లోనే నెగిటివ్ షేడ్స్ ఉంటున్నాయి. కాబట్టి విలన్ పాత్రలు చేయడానికి కూడా హీరోలు అంతగా వెనుకాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోలంతా అటు హీరోలుగానూ ఇటు విలన్లుగానూ కూడా చెలామణీ అయిపోతున్నారు.
ముఖ్యంగా హీరో పాత్ర, విలన్ పాత్ర ఒకే రేంజ్‌లో ఉన్నప్పుడు వాటిని పోషించడానికి ఇద్దరు మహామహులు కావాలి. అలాంటప్పుడు విలన్ పాత్రధారుల్ని కాకుండా ఇద్దరినీ హీరోలనే తీసుకుంటే వచ్చే కిక్కే వేరు. అదే చేస్తున్నారు డైరెక్టర్స్. బాలీవుడ్‌లో అయితే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ చాయిస్ అవుతున్నాడు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘తానాజీ’, ప్రభాస్ చేస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రాల్లో హీరో స్టేచర్‌కి తగిన విలన్ కావాలి అనుకున్నప్పుడు సైఫ్‌నే సెలెక్ట్ చేసుకున్నారు ఆ దర్శకులు. ఇప్పుడు హృతిక్ విలన్‌గా నటిస్తున్న ‘విక్రమ్ వేద’ రీమేక్‌లో హీరో పాత్రకి సైఫ్‌నే తీసుకున్నారు ఈ దర్శకులు.
2017లో వచ్చిన తమిళ మూవీ ‘విక్రమ్ వేద’ చాలా పెద్ద విజయం సాధించింది. దీన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అయితే మనకంటే ముందు బాలీవుడ్ రీమేక్ మొదలైపోయింది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రిలే రీమేక్‌ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి పోషించిన నటోరియస్ క్రిమినల్ పాత్రని హృతిక్ చేస్తున్నాడు. మాధవన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీర్ క్యారెక్టర్‌లో సైఫ్ నటిస్తున్నాడు.
హృతిక్ బర్త్ డే సందర్భంగా ఈమధ్యనే తన లుక్‌ని విడుదల చేశారు. ఇప్పుడు సైఫ్ లుక్ రిలీజయ్యింది. జీన్స్, పోలో నెక్ టీషర్ట్, గాగుల్స్‌తో పర్‌ఫెక్ట్ పోలీసాఫీర్‌గా కనిపిస్తున్నాడు సైఫ్. ఇంత మంచి కోస్టార్‌తో పని చేయడం ఆనందంగా ఉందంటూ హృతికే ఈ లుక్‌ని షేర్ చేశారు. లీడ్ యాక్టర్ల టెరిఫిక్ లుక్స్‌ని బట్టి హిందీలోనూ మూవీ అదరగొట్టే చాన్స్ ఉందనిపిస్తోంది. సెప్టెంబర్ 30 సినిమా విడుదల కానుంది.
This post was last modified on February 24, 2022 5:45 pm
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…