Movie News

గంగూబాయ్‌కి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆలియా భట్ టైటిల్‌ రోల్‌లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కథియావాడి’ చిత్రం రేపు విడుదల కాబోతోంది. కానీ దానిపై పెట్టిన కేసులతో అసలు సినిమా బైటికి వస్తుందా రాదా అనే డైలమా కొద్ది రోజులుగా నెలకొంది. ఆ హై టెన్షన్‌కి కాసేపటి క్రితమే తెరపడింది. సినిమాని ఆపాల్సిన అవసరం లేదని, రిలీజ్ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై పెట్టిన కేసుల్ని కొట్టేసింది. దాంతో గంగూబాయ్‌కి లైన్‌ క్లియరైంది.       

ఓ సినిమా ఎన్ని ఆపసోపాలు పడుతుందో అంతకు కొన్ని రెట్లు ఎక్కువే పడింది ‘గంగూబాయ్ కథియావాడి’. ఓ సెక్స్ వర్కర్ జీవితం ఆధారంగా తీయడం వల్లే ఇదంతా. నిజానికి గంగూబాయ్‌ కామాఠిపురలో అష్టకష్టాలు పడి, ఓ మాఫియా డాన్ సాయంతో ధైర్యం కూడగట్టుకుని, మాఫియా క్వీన్‌గా ఎదిగి, చివరికి సెక్స్‌ వర్కర్ల జీవితాలనే మార్చేసే స్థాయికి చేరుకుంది. ఓ రకంగా ఇది మంచి ఇన్‌స్పైరింగ్ స్టోరీనే. కానీ మధ్యలో కొందరు ఇంటర్‌‌ఫియర్ అవడంతో రభస స్టార్టయ్యింది.
       

ముఖ్యంగా తన తల్లి జీవితాన్ని వక్రీకరిస్తున్నారంటూ గంగూబాయ్ దత్తపుత్రుడు బాబూరావ్‌ పెద్ద గొడవే చేశాడు. కానీ అతనసలు గంగూబాయ్ కొడుకే కాదనే వాదనలు మొదలయ్యాయి. మరోవైపు సినిమాని ఆపమంటూ కామాఠిపుర మహిళలు కూడా గొడవకు దిగారు. అయితే దాన్ని కూడా కోర్టు పట్టించుకోలేదు. సినిమాని ఆపాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని, హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చని తేల్చేసింది.       

కాకపోతే మూవీ టైటిల్‌ మార్చమని నిన్న సూచించింది. కానీ ఇవాళ తీర్పు చెప్పేటప్పుడు ఆ విషయాన్ని కోర్టు టచ్ చేయలేదని తెలిసింది. ఒక మహిళ అలాంటి బ్యాగ్రౌండ్ నుంచి రావడం తప్పేమీ కాదని, సమాజానికి ఆమె ఎంత చేసిందో చూపించడం తనని కించపర్చడం ఎలా అవుతుందని  ప్రశ్నించిన భన్సాలీ తరఫు లాయర్.. ఇప్పటికే ప్రమోషన్స్‌ పూర్తయ్యి, సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి, రిలీజ్‌కి రెడీ అయిన సినిమాకి టైటిల్ మార్చడం కుదరదని వాదించాడట. దాంతో కోర్టు కూడా కన్విన్స్ అయ్యిందని సమాచారం. అది నిజమైతే గంగూబాయ్‌ రేపు సేమ్‌ టైటిల్‌తో  ప్రేక్షకుల ముందుకొస్తుంది. లేదంటే కాస్త మారి వచ్చే చాన్స్ ఉంది. 

This post was last modified on February 24, 2022 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…

6 minutes ago

జ‌గ‌న్ స‌తీమ‌ణిపై దుర్భాష‌లు.. టీడీపీ నేత‌పై బాబు క‌ఠిన చ‌ర్య‌లు

త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. త‌న పార్టీవారిని కూడా వ‌దిలి…

22 minutes ago

పాత వాహనాలపై కొత్త నిబంధనలు.. లేదంటే కేసే!

మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…

39 minutes ago

పెద్ది అసలు కథ వేరే ఉంది

ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…

53 minutes ago

పవన్ నిబద్ధతకు అద్దం పట్టిన ‘బాట’ వీడియో

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…

2 hours ago

బాషా ఫ్లాష్ బ్యాక్ : ముఖ్యమంత్రితో వివాదం

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…

2 hours ago