అనుకున్నదే అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరుకుతాడా.. ఎలా ఇబ్బంది పెడదామా అని చూసే జగన్ సర్కారు.. ఏపీలో ఆయన కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’ను ఇరుకున పెట్టడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తోంది. పోయినేడాది ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడు ఉన్నట్లుండి టికెట్ల ధరలు తగ్గించేసి.. బెనిఫిట్ షోలు, అదనపు షోలు పడకుండా ఉక్కు పాదం మోపి ఎంతగా ఆ చిత్రాన్ని ఎలా దెబ్బ తీశారో తెలిసిందే. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు.
మధ్యలో ‘అఖండ’ సినిమాకు పెద్ద ఎత్తున థియేటర్ల యాజమాన్యాలు స్పెషల్ షోలు వేసుకుంటే చూసీ చూడనట్లు వదిలేసింది జగన్ సర్కారు. ‘పుష్ప’ విషయానికొస్తే ఇలాంటి షోలు పడకుండా ఆపారు కానీ.. థియేటర్ల దగ్గర రేట్లు పెంచి టికెట్లు అమ్ముతున్నా, దానికి బ్లాక్ టికెట్ల దందా బాగా నడిచిందని తెలిసినా పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ విషయానికొచ్చేసరికి అధికార యంత్రాంగం అలెర్ట్ అయిపోయింది.
ఎగ్జిబిటర్లతో ముందు రోజే ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి మరీ టికెట్ల రేట్లు, స్పెషల్ షోల విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. రిలీజ్ రోజు తనిఖీలకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో భారీ రేట్లకు ‘భీమ్లా నాయక్’ను కొన్ని బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. నిర్మాణ సంస్థకు కూడా ఇబ్బంది కలిగించే విషయమే. అనుకున్న స్థాయిలో రికవరీ లేకుంటే నిర్మాతలు బయ్యర్లను ఆదుకోక తప్పదు. ఈ పరిస్థితిని ఊహించిన పవన్.. నిర్మాతలకు ఒక సూచన చేసినట్లు సమాచారం.
ఏపీలో వసూళ్ల గురించి, రికవరీ గురించి ఎక్కువ ఆలోచించవద్దని.. ఓవరాల్‌గా సినిమాకు ఎంత ఆదాయం, లాభం వచ్చిందో చూసుకోవాలని.. ఏపీలో బయ్యర్లను కాస్త చూసుకోవాలని.. అవసరమైతే తన పారితోషకం ఆమేరకు తగ్గించుకోమని పవన్ చెప్పేశాడట. ‘భీమ్లా నాయక్’ను ఇబ్బంది పెడతారని తెలిసే మొన్న మత్స్యకార అభ్యున్నతి సభలో ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించాడు జనసేనాని. కొత్త టికెట్ల రేట్ల జీవోను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం.. ఇప్పుడేమో థియేటర్లపై ఉక్కు పాదం మోపడానికి సిద్ధమవడం చూసే పవన్ నిర్మాతలకు ఈ మేరకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on February 24, 2022 1:15 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…