ఈ ఒక్క సినిమా వదిలేయ్!: కొరటాల

దేవిశ్రీప్రసాద్ ని ఈ మధ్య చాలా మంది దూరం పెడుతున్నారు కానీ, సుకుమార్ మాదిరిగా కొరటాల శివకు కూడా అతడిని దూరం పెట్టడానికి తగిన కారణం లేదు. ఎందుకంటే ఈ ఇద్దరు దర్శకులకు దేవి తన బెస్ట్ ఇస్తూ ఉంటాడు. కొరటాల గత చిత్రం భరత్ అనే నేను లో కూడా వచ్చాడయ్యో సామి, భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్ సాంగ్స్ చేసాడు.

అయినా కానీ ఆచార్య సినిమాకు అతడిని కాదని మణిశర్మతో చేస్తున్నాడు. చిరంజీవి, చరణ్ ఈ సినిమాకు దేవి వద్దనుకున్నారని భోగట్టా. అయితే పుష్ప చిత్రానికి కూడా దేవి వద్దని అల్లు అర్జున్ చెప్పినా కానీ సుకుమార్ తలొగ్గలేదు.

ఆచార్యకు అవకాశం ఇవ్వకపోయినా కానీ దేవితో కొరటాల టచ్ లోనే ఉన్నాడు. ఈ ఒక్క సినిమా మిస్ అయినా కానీ తదుపరి చిత్రానికి మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి పని చేస్తారు. తన పుట్టినరోజు సందర్భంగా కలిసినపుడు దేవితో కొరటాల ఇదే చెప్పినట్టు ఇండస్ట్రీ టాక్.