కెరీర్ ఆరంభంలో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి చిన్న సిినిమాలు చేసి పేరు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. అలాంటి సినిమాలతో కెరీర్ ఆరంభించిన దర్శకుడు ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్‌ను డైరెక్ట్ చేయబోతుండటం అనూహ్యమైన విషయం. ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి తన స్థాయి పెంచుకున్నప్పటికీ.. ఇంత త్వరగా ప్రభాస్‌తో అతను జట్టు కడతాడని ఎవరూ అనుకోలేదు.
వీరి కలయికలో ‘రాజా డీలక్స్’ అనే సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందు ఇది ఊహాగానమే అనుకున్నారు కానీ.. ఈ ప్రాజెక్టు పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. ఈ వేసవిలో మూణ్నాలుగు నెలలు డేట్లు కేటాయించి చాలా వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. అతడి మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్‌లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇంకా ‘రాజా డీలక్స్’ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదన్న మాటే కానీ.. సినిమా పనులు మాత్రం వేగంగా జరిగిపోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు చివరి దశలో ఉండగా.. మరోవైపు ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందట. ‘రాజా డీలక్స్’ కోసం భారీగా సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో ఈ సెట్లను నిర్మిస్తున్నారట. ఔట్ డోర్ వెళ్లకుండా సెట్స్‌లోనే మెజారిటీ సన్నివేశాలను వేగంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మారుతి మామూలుగా తక్కువ బడ్జెట్లో సినిమాలు లాగించేస్తుంటాడు. కానీ ప్రభాస్ సినిమా అన్నాక భారీతనం చూపించకపోతే కష్టం. అతడి వేరే చిత్రాలతో పోలిస్తే ఖర్చు తక్కువే కానీ.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేంత భారీతనం అయితే ఇందులో ఉంటుందట. మారుతి ‘పక్కా కమర్షియల్’ సినిమాను పూర్తి చేసి పక్కన పెట్టేసి ఈ చిత్రంలో పూర్తిగా మునిగిపోయినట్లు సమాచారం.
This post was last modified on February 23, 2022 4:36 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…