సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించింది యువి క్రియేషన్స్. కరోనా కేసులు పెరుగుతున్నా.. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిపోయినా.. తమ సినిమాను థియేటర్లలోకి దించాల్సిందే అని ఒక దశలో పట్టుదలతో ఉన్నారు. కానీ చివరికి కొవిడ్ ప్రభావం బాగా పెరిగిపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని.. థియేటర్లను బుక్ చేసుకుని.. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టాక ఇలా సినిమాను వాయిదా వేసుకోవాల్సి రావడం ఎంత ఇబ్బందికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐతే కొవిడ్ కాలంలో ఇలాంటి ఇబ్బందులు మామూలైపోయాయి. అదృష్టవశాత్తూ థర్డ్ వేవ్ మరీ ఎక్కువ రోజులు కొనసాగకపోవడంతో ఇప్పుడిక మళ్లీ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 11నే రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.ఐతే ఆల్రెడీ ఫస్ట్ కాపీ తీసేశాక ఇక సినిమాను ముట్టుకోవాల్సిన పని ఉండదనే అనుకుంటారంతా.
కానీ దర్శకుడు రాధాకృష్ణకుమార్, ఎడిటర్ కలిసి మళ్లీ కత్తెరకు పని చెబుతున్నట్లు సమాచారం. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, కొన్ని చోట్ల సినిమా డ్రైగా తయారవడంతో మళ్లీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నట్లు తెలిసింది. జనవరిలో ట్రైలర్ లాంచ్ చేసినపుడు.. అది మరీ లెంగ్తీగా ఉందన్న కంప్లైంట్లు వచ్చాయి. ట్రైలరే అలా ఉంటే సినిమా సంగతేంటో అన్న కామెంట్లు కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడ్డాక కొందరు ప్రముఖులకు స్పెషల్ షోలు వేసి ‘రాధేశ్యామ్’ను చూపించారని.. వాళ్లు చెప్పిన సూచనల మేరకు ఎడిటింగ్ పరంగా కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. ముందు అనుకున్న దానితో పోలిస్తే తక్కువ నిడివితో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. ప్రభాస్ ఇమేజ్‌కు భిన్నంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో అన్న సందేహాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్న మాట వాస్తవం.
This post was last modified on February 23, 2022 4:03 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…