కమల్ హాసన్ సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో పని గట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. హిట్టవుతుందా ఫ్లాపవుతుందా అని ఎవరూ ఆలోచించరు. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నారు లాంటి విషయాలపై కూడా ఆసక్తి చూపించరు. అందరూ తెలుసుకోవాలనుకునేది ఒకటే. ఆయన ఏ పాత్ర చేస్తున్నారు, తెరపై ఎలా కనిపించబోతున్నారు అనేదే. ‘విక్రమ్’ మూవీ విషయంలోనూ అంతే.
ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, కమల్ లుక్ చూశాక ఆయన కోసం లోకేష్ కనకరాజ్ ఓ పవర్ ప్యాక్ట్ స్క్రిప్ట్ రెడీ చేశాడని అర్థమయ్యింది. అదే ఇంటరెస్ట్‌ను అమాంతం పెంచేసింది అంటే.. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ కమల్తో కలవడం అంచనాలను రెట్టింపు చేసేసింది. అంత గొప్ప ఆర్టిస్టుల్ని తీసుకొస్తున్నారంటే ఇక సినిమా నెక్స్ట్ లెవెల్ అని ఫిక్సైపోయారంతా.
అందుకే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తీస్తున్నాడు లోకేష్. ముఖ్యంగా క్లైమాక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడట. ఆ సీన్స్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుందట. లోకేష్‌కి ఒక ప్రత్యేక శైలి ఉంది. అతని సినిమాల్లో హీరో, విలన్ ఒకరినొకరు చూసుకోరు. క్లైమాక్స్‌లో మాత్రం ఎదురుపడతారు. అంతవరకు అజ్ఞాతంగా సాగిన యుద్ధాన్ని ఎదురెదురుగా నిలబడి కొనసాగిస్తారు. హోరాహోరీగా పోరాడి ముగిస్తారు. ఈ సినిమాలో కూడా హీరో కమల్, విలన్ విజయ్ సేతుపతి మధ్య ఓ అదిరిపోయే గేమ్ నడుస్తుందట. ఇద్దరూ క్లైమాక్స్‌లో ఓ రేంజ్‌లో తలపడతారట. ఆ హై ఆక్టేన్ సీన్స్‌ని పదిహేను రోజుల పాటు తీశాడట లోకేష్. ఆ ఎపిసోడ్ మొత్తం అద్భుతంగా వచ్చిందని, సినిమా అంతా ఒకెత్తయితే క్లైమాక్స్ ఒక్కటీ ఒకెత్తని టీమ్‌లోని ఓ సభ్యుడు చెప్పడంతో విషయం బైటికి వచ్చింది.
కమల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ముఖ్యమైన ఆపరేషన్ కోసం కాస్త నెగిటివ్ షేడ్స్‌లో కూడా కనిపిస్తారట. విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఫహాద్ ఫాజిల్ పాత్ర ఏంటనేది మాత్రం ఇంతవరకు బైటికి రానివ్వలేదు. మొత్తానికి ముగ్గురు మహానటుల్ని ఒక స్క్రీన్ మీద చూపించడం కత్తిమీద సామే. దానిలో లోకేష్ ఎంతవరకు విజయం సాధిస్తాడో సినిమా చూశాకే తెలిసేది.
This post was last modified on February 23, 2022 7:46 am
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…