ఈ సారి వేసవికి సినిమాల సందడి మామూలుగా ఉండబోవట్లేదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న తరహాలో భారీ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా సినిమాలకు తోడు సర్కారు వారి పాట, ఆచార్య.. ఇలా పెద్ద సినిమాలు చాలానే అభిమానులను అలరించబోతున్నాయి. వీటికి తోడు ఎఫ్-2, అంటే సుందరానికి, పక్కా కమర్షియల్, గని, లాంటి మీడియం రేంజ్ సినిమాల హంగామా కూడా ఉంది. వీటిలో ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లు ఖరారు చేసుకుంటున్నాయి.
ఇప్పుడు ఇంకో ఆసక్తికర చిత్రం విడుదల ఖాయమైంది. ఆ చిత్రమే.. మేజర్. ఫిబ్రవరి 11నే రావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రం.. కరోనా మూడో వేవ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. సరైన సమయంలో ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని హీరో, రైటర్ అడివి శేష్ ఇటీవల వెల్లడించాడు. ఇప్పుడతను డేట్ అనౌన్స్ చేసేశాడు.
మే 27న ‘మేజర్’ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ ప్రకటనను ఊరికే మాటలతో కాకుండా ఒక వీడియో రూపంలో ఇచ్చారు. 26/11 ముంబయి ఉగ్రవాద దాడుల సందర్భంగా టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ దాడుల సందర్భంగా ఉన్నికృష్ణ వీరత్వాన్ని చూపించే ఒక కళ్లు చెదిరే గ్లింప్స్‌ను ఈ సందర్భంగా చూపించారు.
అది చూస్తే ‘మేజర్’ ఒక క్లాసిక్‌గా నిలవబోతోందని.. భారతీయ ప్రేక్షకులందరినీ ఉద్వేగానికి గురి చేసి వారి మనసులు గెలవబోతోందని అనిపిస్తోంది. ఇంతకుముందు అడివి శేష్‌తో ‘గూఢచారి’ చిత్రాన్ని రూపొందించిన శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతడితో కలిసి శేష్ స్క్రిప్టు తీర్చిదిద్దాడు. మహేష్ బాబు సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి సోనీ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇందులో శేష్ సరసన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటించింది.
This post was last modified on February 22, 2022 6:07 pm
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…