టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం `గీత గోవిందం` ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.ఎస్.తమన్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చుతున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా కనిపించబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది.
కానీ, పలు కారణాల వల్ల మేకర్స్ ఈ మూవీని వేసవి కానుకగా మే 12వ తేదీకి షిఫ్ట్ చేశారు. ఇక మొన్నీమధ్య బయటకు వచ్చిన సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ `కళావతి`కి విశేష ఆదరణ దక్కింది. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఈ సాంగ్.. మహేష్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది.
అయితే తాజా సమాచారం ప్రకారరం.. ఈ సినిమా నుంచి అసలైన ట్రీట్ మరికొద్ది రోజుల్లో రాబోతోందట. ఈ సినిమా టైటిల్ ట్రాక్ అయినటువంటి మాస్ సాంగ్‌పై తమన్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేశాడు. దీంతో ఆ సాంగ్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు మేకర్స్ ఆ మాస్ సాంగ్ ట్రీట్ కి గాను డేట్ ఫిక్స్ చేశారట. మార్చ్ 18న ఆ సాంగ్‌ను విడుదల చేయనున్నారని ప్రస్తుతం బలంగా టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
This post was last modified on February 22, 2022 11:10 am
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…