టీవీ సీరియళ్లతో మొదలుపెట్టి.. సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌తో మంచి పాపులారిటీనే సంపాదించిన నటుడు సమీర్. ఫుల్ లెంగ్త్ రోల్స్ తక్కువే అయినా.. చిన్న చిన్న పాత్రలతోనే గుర్తింపు సంపాదించాడతను. వందల సినిమాల్లో నటించి ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నాడు. ‘సై’లాంటి సినిమాల్లో అతను చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదురైన ఒడుదొడుకుల గురించి అతను మాట్లాడాడు.
ఈటీవీలో చేస్తున్న సీరియల్ నుంచి ఎఫైర్ పేరు చెప్పి తనను ఎలా తొలగించింది.. అలాగే నాగబాబుతో తనకున్న విభేదాల గురించి అతను ఆసక్తికర విషయాలు చెప్పాడు.తాను టీవీ సీరియళ్లలో చాలా బిజీగా ఉన్న రోజుల్లో తన గురించి ఈటీవీ సుమన్‌కు లేని పోనివి చెప్పి తన కెరీర్‌ను కొందరు దెబ్బ తీసినట్లు సమీర్ వెల్లడించాడు. తాను సెట్లోనే ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా ప్రచారం చేశారన్నాడు. సడెన్‌గా ఒక రోజు సుమన్ తనకు ఫోన్ చేసి ఈ సీరియల్ నుంచి తీసేస్తున్నట్లు చెప్పారన్నారు.
తనను సంజాయిషీ కూడా అడగలేదని.. సీరియల్ ఆపేశారని.. ఆ దెబ్బతో తనకు వేరే సీరియళ్లలో కూడా ఛాన్సులు ఆగిపోయాయని.. ఉన్నట్లుండి తాను రోడ్డు మీదికి వచ్చేశానని సమీర్ తెలిపాడు. ఎఫైర్ పెట్టుకోవాలంటే తనకు వేరే ప్లేసులే లేనట్లు సెట్లో పెట్టుకుంటానా అని సమీర్ ప్రశ్నించాడు. ఇంటి రెంట్, కారు ఈఎంఐ కట్టలేక ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని.. తర్వాత సినిమాల్లో నెమ్మదిగా అవకాశాలు పెరగడంతో కుదురుకున్నానని చెప్పాడు సమీర్.
కొంత కాలం తర్వాత సుమన్ తనకు ఫోన్ చేసి జరిగిన దానికి సారీ చెప్పినట్లు సమీర్ వెల్లడించాడు. ఇక నాగబాబుతో ‘ఆరెంజ్’ సినిమా చేసినపుడు.. ఆయన తనకు బాగా క్లోజ్ అయ్యారని.. అది చూసి ఓర్వలేక తన గురించి కొందరు ఆయనకు లేనిపోనివి చెప్పి తనను దూరం పెట్టేలా చేశారని.. కొంత కాలానికి ఆయనతోనూ విభేదాలు తొలగిపోయి ఇప్పుడు మామూలుగా ఉంటున్నట్లు సమీర్ తెలిపాడు.
This post was last modified on February 21, 2022 6:42 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…