భీమ్లా నాయక్ మానియా అప్పుడే మొదలయిపోయింది. పవన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయి ఉండడంతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఉన్న అభిమానులు అంతా ఆ మానియాలోనే ఉన్నారు.టికెట్ రేట్ల లో మార్పులు లేకపోయినా అవేవీ పట్టించుకునే స్థితిలో లేరు.మరోవైపు రెండు లక్షల మందికి పైగా అభిమానులు సినిమా రాక కోసం,ఆన్లైన్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కోసం బుక్ మై షో యాప్ ను తెరుస్తూ మూస్తూ నిరీక్షిస్తున్నారని చిత్ర వర్గాలు ఆధారాలతో సహా ధ్రువీకరిస్తున్నాయి.
పవన్ సినిమా రాక నేపథ్యంలో టీడీపీ కూడా బాగానే ఈ సినిమాకు మద్దతు ఇస్తోంది. మెగాభిమానులే కాదు మిగతా కథానాయకులు కూడా ఆయనకు ఆల్ ద బెస్ట్ చెబుతోంది. పైకి వెల్లడి చేయకున్నా వైసీపీలో కూడా పవన్ అభిమానులు ఉన్నారు.వీరంతా కూడా ఈ సినిమా ఫలితంపై ఆసక్తిగానే ఉన్నారు.
ముఖ్యంగా కడప అభిమానులు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. మేం జగనన్నను ప్రేమిస్తాం పవనన్నకు ఓటేస్తాం అంటూ రాసి ఓ పోస్టర్ ను భీమ్లా నాయక్ స్టిల్ తో విడుదల చేశారు.దీంతో ఈ పోస్టర్ పొలిటికల్ గా హల్చల్ చేస్తోంది.వాస్తవానికి ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో కూడా పవర్ స్టార్ అని వేయరు అని, అలా వేయొద్దు అని డైరెక్టర్ సాగర్ చంద్ర ను ఎప్పటి నుంచో అభిమానులు కోరుతున్నారు. వారి విన్నపం మేరకు, పవన్ అభిప్రాయం మేరకు చిత్ర దర్శక నిర్మాతలు జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన అని టైటిల్ కార్డ్స్ లో వేయనున్నారు.
ఇక ఈ వేడుకకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ముఖ్య అతిథులుగా రానున్నారు. రేపటి వేళ జరిగే ఈ వేడుకలకు రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది.మరోవైపు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలను యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
ఈ సభలో పవన్ ఏం మాట్లాడనున్నారో అన్నది కూడా ఓ ఆసక్తికరంగానే ఉంది.ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తో సన్నిహిత బంధాలు ఉన్న పవన్ వారిని ఉద్దేశించి చెప్పే మాటలతో పాటు ఏపీ సర్కారును ఈ సారి కూడా గతంలో టార్గెట్ చేసిన మాదిరిగానే చేస్తారా లేదా సైలెంట్ అయిపోయి సినిమా వరకే తన ప్రసంగాన్ని పరిమితం చేస్తారా అన్న ఉత్కంఠత ఫిల్మ్ అండ్ పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొని ఉంది.ఇప్పటికే ఈ వేడుకలకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని పిలిస్తే బాగుండేది అని నిర్మాత వంశీకి ట్విటర్ వేదిక ద్వారా పవన్ అభిమానులు సలహా ఇస్తున్నారు.ఆ విధంగా చేస్తే రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పెద్దలను సమన్వయం చేయడంతో పాటు, ఇరువురికీ సమ ప్రాధాన్యం ఇచ్చినవారం అవుతామని వారి అభిప్రాయం.
This post was last modified on February 20, 2022 1:08 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…