బోయపాటి శ్రీనుకు దర్శకుడిగా ఎక్కువ పేరొచ్చింది.. అతను కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు అందుకుంది నందమూరి బాలకృష్ణతో తీసిన చిత్రాలతోనే. కెరీర్ ఆరంభంలో రవితేజతో ‘భద్ర’ లాంటి సూపర్ హిట్ తీసిన బోయపాటి.. ఆ తర్వాత బాలయ్య కాకుండా పెద్ద హిట్ ఇచ్చిందంటే ఒక్క అల్లు అర్జున్‌తోనే. వీరి కలయికలో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్‌ను తట్టుకుని నిలబడింది. వెంకటేష్‌తో చేసిన ‘తులసి’ ఓ మోస్తరుగా ఆడితే.. ఎన్టీఆర్‌తో తీసిన ‘దమ్ము’ ఫ్లాప్ అయింది.
ఇక రామ్ చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘జయ జానకి నాయక’ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ఫ్లాపే. బాలయ్యతో సినిమా అనగానే తన శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా వాడి.. అభిమానులను అలరించే, మాస్‌కు పూనకాలు తెప్పించే సినిమాలు చేసే బోయపాటి.. వేరే హీరోల సినిమాల విషయానికి వచ్చేసరికి ఇలా అంచనాలను అందుకోలేకపోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
‘సింహా’ దగ్గర్నుంచి పరిశీలిస్తే.. బాలయ్య సినిమా తర్వాత వేరే హీరోల కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చే బోయపాటి చిత్రాలన్నీ చాలా వరకు బోల్తా కొట్టినవే. వేరే హీరోల ఇమేజ్‌కు, బోయపాటి ఇమేజ్‌కు మ్యాచ్ కాకపోవడమో.. బోయపాటి కథల్లో వాళ్లు సింక్ కాకపోవడమో.. ఇలా ఏదో ఒకటి సమస్యగా మారుతోంది. ఇప్పుడు ‘అఖండ’ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి.. యువ కథానాయకుడు రామ్‌తో జట్టు కడుతున్నాడు.
ఈ కాంబినేషన్లో కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఐతే రామ్‌కు కొంత మాస్ ఫాలోయింగ్ ఉంది, అలాగే కొన్ని మాస్ కథలూ చేశాడు. కానీ బోయపాటి మార్కు ఊర మాస్ కథలకు.. లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లకు రామ్ సూటవుతాడా అన్న సందేహం ఉంది. బోయపాటి స్టయిల్లో మరీ విడ్డూరంగా, అతిగా ఉండే యాక్షన్ ఘట్టాలు అతడికి సెట్ కాకపోవచ్చు. పైగా బాలయ్య కాకుండా వేరే హీరోలతో తీసిన సినిమాల్లో చాలా వరకు ఫెయిల్ కావడం రామ్‌ను కొంత కంగారు పెట్టే విషయమే. మరి ఈ నెగెటివ్ సెంటిమెంటును దాటి రామ్‌కు సరిపోయే సినిమా తీసి హిట్ కొడతాడేమో చూడాలి బోయపాటి.
This post was last modified on February 20, 2022 10:49 am
‘పుష్ప...పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్...’ అంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి దేశమంతా ‘పుష్ప’ ఫీవర్ వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. సామాన్యుల…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌కు 'ఫార్ములా ఈ - రేస్' ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్పటికే…
పేద్ద గన్ పట్టుకుని.. ఆరు అడుగుల ఎత్తుతో చూడగానే నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్న ఈ అధికారి.. ఐపీఎస్…
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్...ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...ఈ ఇద్దరూ ఒక్కటేనా? పవన్ అభిమానులు అయితే ఈ…
కొత్త సంవత్సరం వేడుకల సందడి మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా వైన్…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అధికారికంగా మన్మోహన్ సింగ్…