తమిళంలో కొన్నేళ్ల కిందట సిద్ధార్త్ హీరోగా, బాబీ సింహా విలన్ పాత్రలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘జిగర్ తండ’ సినిమా పెద్ద సెన్సేషన్. ఊహించని కథాకథనాలతో సాగే ఈ సినిమా తమిళంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో బాబీ సింహా చేసిన విలన్ పాత్ర ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పొచ్చు. ఈ సినిమాను తెలుగులో హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’గా రూపొందించాడు.
హీరో వరుణ్ తేజ్‌తో బాబీ సింహా చేసిన విలన్ పాత్ర చేయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు హరీష్. తమిళంతో పోలిస్తే మరింత ఎంటర్టైనింగ్‌గా ఈ పాత్రను మలచడంతో పాటు దానికో లవ్ స్టోరీని కూడా జోడించి నిడివి కూడా పెంచాడు. ఈ ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా హిందీలో ‘బచ్చన్ పాండే’ పేరుతో రీమేక్ కావడం విశేషం. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మాదిరే విలన్ పాత్రనే ఇక్కడ కూడా లీడ్ రోల్‌గా తీసుకున్నారు.
అక్షయ్ లాంటి టాప్ హీరో ఈ పాత్రను చేయడంతో అక్కడ దీన్ని మరింత డెవలప్ చేసినట్లే కనిపిస్తోంది. వయొలెంట్ లుక్‌తో అక్షయ్ ఈ పాత్రలో చాలా బాగా కనిపిస్తున్నాడు. పాత్ర కూడా మరింత వయొలెంట్‌గా మారినట్లే ఉంది. ఐతే తమిళం, తెలుగుతో పోలిస్తే హిందీలో ఓ కీలకమైన మార్పు చేశారు. తమిళంలో సిద్ధు, తెలుగులో అధర్వ చేసిన అప్ కమింగ్ డైరెక్టర్ పాత్రను.. అమ్మాయిగా మార్చేశారు. ఆ పాత్రలో కృతి సనన్ నటించింది. తన వెంటే ఉండే ఫ్రెండ్ పాత్రను అర్షద్ వార్సి చేశాడు.
సౌత్ వెర్షన్లతో పోలిస్తే హిందీలో కామెడీ డోస్ మరింత పెరిగినట్లుంది. కాకపోతే ఆ కామెడీ అంతా కూడా మరీ లౌడ్‌గా అనిపిస్తోంది. ‘జిగర్ తండ’తో పోలిస్తే హిందీ రీమేక్ రూపు రేఖలే మారిపోయినట్లు కనిపిస్తోంది. ఫర్హద్ సాంజీ రూపొందించిన ఈ చిత్రం.. రోహిత్ శెట్టి చిత్రాలను తలపిస్తోంది. తెలుగులో మాదిరే ప్రధాన పాత్రకు ఒక లవ్ స్టోరీ జోడించారు కానీ.. అందులోనూ మార్పు కనిపిస్తోంది. తన ప్రేయసిని తనే చంపుకున్న క్రూరుడిగా అక్షయ్‌ను చూపించారు. ఓవరాల్‌గా చూస్తే సినిమా ఎంటర్టైనింగ్‌గా అనిపిస్తోంది. మరి హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.
This post was last modified on February 18, 2022 8:17 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…