సినిమా ఇండస్ట్రీలో హిట్, ప్లాప్ మీదే కెరీర్ డిసైడ్ ఉంటుంది. ఎన్ని హిట్స్ ఇచ్చినా.. మధ్యలో ప్లాప్ వస్తే ఇంక అంతే సంగతులు. అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. దర్శకుడు రమేష్ వర్మ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే తయారైంది. చాలా కాలం తరువాత ‘రాక్షసుడు’ సినిమాతో హిట్టు కొట్టాడు ఈ దర్శకుడు. దీంతో అందరి దృష్టి అతడిపై పడింది. రవితేజని ఒప్పించి ‘ఖిలాడి’ సినిమాను పట్టాలెక్కించారు. విడుదలకు ముందు ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది.
కానీ రిలీజ్ తరువాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు ఈ ‘ఖిలాడి’. ఒకట్రెండు సీక్వెన్స్ లు తప్ప సినిమా గురించి చెప్పుకునే స్థాయిలో ఏమీ లేదు. ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఆలోచించకుండానే రమేష్ వర్మతో వంద కోట్ల ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు ‘ఖిలాడి’ ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ. దానికి ‘యోధ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
ఇదో పాన్ ఇండియా సినిమా అని.. పెద్ద స్టార్ నటించబోతున్నట్లు మీడియా ముందు చెప్పారు.
ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. రమేష్ వర్మ డీలా పడ్డారు. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే.. ఇలాంటి సమయంలో రమేష్ వర్మ వంద కోట్ల ప్రాజెక్ట్ ని డీల్ చేయలేరనే మాటలు వినిపిస్తున్నాయి. నిర్మాత కూడా ఇదే ఫీలైతే మాత్రం ఆ ప్రాజెక్ట్ రమేష్ వర్మ చేజారిపోయినట్లే.
అయితే ఆయనకు మరో సినిమా అవకాశం ఉంది. ‘ఖిలాడి’ సినిమా కంటే ముందే ‘రాక్షసుడు 2’ ప్రాజెక్ట్ సెట్ అయింది. దానికి కూడా కోనేరు సత్యనారాయణే నిర్మాత. ఆ సినిమాని గనుక తక్కువ బడ్జెట్ లో తీసి హిట్ కొడితే మాత్రం రమేష్ వర్మ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on February 17, 2022 10:20 am
కొన్ని సినీ సిత్రాలు విచిత్రంగా ఉంటాయి. అవి సదరు హీరోలు దర్శకులు చెప్పినప్పుడే బయటికి వస్తాయి. అలాంటిదే ఇది. ఎల్లుండి…
పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ కు చెందిన 26 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడిన సంగతి…
సమంత నిర్మాతగా మారి తీసిన శుభం ఎల్లుండి విడుదల కాబోతోంది. దీని మీద బోలెడంత నమ్మకంతో ఉన్న సామ్ నిన్నటి…
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…
ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…