కమర్షియల్ హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన అమలాపాల్‌కి వెంటవెంటనే అవకాశాలు బాగానే వచ్చాయి. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ జోడీ కట్టే చాన్సులు దక్కాయి. కానీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం, ఆ తర్వాత కొన్ని సమస్యలు చుట్టుముట్టడం వంటి వాటి వల్ల కెరీర్ కాస్త డల్లయ్యింది. అయితే ‘ఆమె’ చిత్రంతో మళ్లీ స్పీడు పెంచింది అమల.
గ్లామరస్ పాత్రలు చేసినా.. చాలావరకు హోమ్లీ లుక్‌లోనే మెప్పించింది అమల. అలాంటిది ‘ఆమె’ సినిమాలో న్యూడ్‌గా కనిపించేసరికి జనాలు అవాక్కైపోయారు. ఒకటో రెండో సీన్స్ కాదు.. సినిమాలో మేజర్ పోర్షన్ అంతా ఆమె బట్టలు లేకుండానే ఉంటుంది. దాంతో ఆమె గట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పక తప్పలేదు. పోయినేడు వచ్చిన ‘పిట్టకథలు’ ఆంథాలజీలో కూడా కాస్త హాట్ రోల్లోనే కనిపించిందామె.
కానీ ఇప్పుడు ఓ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పాత్ర చేయడానికి ఓకే చెప్పింది. ఫహాద్ ఫాజిల్, సాయిపల్లవి జంటగా ‘అథిరన్’ మూవీ తీసిన వివేక్ డైరెక్షన్లో ‘టీచర్’ అనే మూవీకి ఓకే చెప్పింది అమల. ఈ సినిమా నిన్న కేరళలో ప్రారంభమయ్యింది. మాతృభాష కావడంతో తమిళ, తెలుగు చిత్రాలతో పాటు మాలీవుడ్ మూవీస్ కూడా తరచుగా చేస్తుంటుంది అమల. త్వరలో ఆమె నటించిన ‘ఆడుజీవితం’ సినిమా కూడా రిలీజ్ కూడా కాబోతోంది. ఇంతలోనే మరొకటి పట్టాలెక్కింది.
అటు తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది అమల. వాటిలో ఒకదాన్ని ప్రొడ్యూస్ కూడా చేస్తోంది. రెండూ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరి తమిళ, మలయాళ బాషల్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న అమల.. తెలుగులో ఎందుకు నటించడానికి ఎందుకు ఆసక్తి చూపించడం లేదంటూ కొందరు ఆరాలు తీస్తున్నారు. ఆమధ్య నాగార్జునతో ప్రవీణ్ సత్తారు తీస్తున్న ‘ద ఘోస్ట్’లో నటించమని అడిగితే.. భారీ రెమ్యునరేషన్ అడిగి భయపెట్టిందన్నారు. అది నిజమో కాదో తెలీదు కానీ.. నానితో ‘జెండాపై కపిరాజు’లో నటించాక ఇంతవరకు మరో హీరో సరసన ఆమె కనిపించలేదనేది మాత్రం వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates