తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలో దిగుతోందంటే.. దానికి పోటీగా ఇంకో సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా పవన్ చిత్రంతో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర నిలవడం కష్టమే. అందులోనూ ప్రి రిలీజ్ హైప్ ఎక్కువగా ఉన్న పవన్ సినిమాకు ఎదురెళ్తే చాలా ఇబ్బందే.
సంక్రాంతి టైంలో మాత్రమే ఇలాంటి పోటీకి ఆస్కారముంటుంది. వేరే సమయాల్లో ఎప్పుడూ పవన్ సినిమాకు పోటీ ఉండదు. ఐతే వచ్చే వారం పవన్ సినిమా భీమ్లా నాయక్ రాబోతోందని తెలిసి కూడా శర్వానంద్ చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు వెనక్కి తగ్గట్లేదు.
భీమ్లా నాయక్ వాయిదా పడుతుందన్న అంచనాలతో ఈ సినిమాను ఫిబ్రవరి 25కు షెడ్యూల్ చేశారు. కానీ పవన్ సినిమాను ఆ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఆడవాళ్ళు మీకు జోహార్లుతో పాటు వరుణ్ తేజ్ సినిమా గనిని కూడా వాయిదా వేయడం లాంఛనమే అని అంతా అనుకున్నారు.
కానీ గని టైం సైలెంటుగా ఉండగా.. ఆడవాళ్ళు మీకు జోహార్లు బృందం మాత్రం తమ సినిమా ఫిబ్రవరి 25కే వస్తుందని ఘంటాపథంగా చెబుతోంది. బుధవారం హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన్నా డబ్బింగ్ పూర్తి చేసి ఫొటోలకు పోజులు ఇచ్చారు.
ఈ ఫొటోను రిలీజ్ చేస్తూ తమ సినిమా 25కే వస్తుందంటూ చిత్ర బృందం మీడియాకు సమాచారం ఇచ్చింది. మరి భీమ్లా నాయక్ బరిలో ఉన్నా తమకు ఇబ్బంది లేదని ధీమాగా ఈ అప్‌డేట్ ఇచ్చారా.. లేక పవన్ సినిమా ఏమైనా వాయిదా పడుతుందేమో అన్న ఆశతోనా అన్నది తెలియడం లేదు.
వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతున్న శర్వాకు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం. అతడి కెరీర్‌కు చాలా కీలకమైన సినిమా విషయంలో ఇంత రిస్క్ అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి శర్వా అండ్ టీం ధీమా ఏంటో చూడాలి. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల రూపొందించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
This post was last modified on February 17, 2022 6:19 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…