మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట నుంచి రిలీజైన తొలి సింగిల్ కళావతికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది శ్రోతల నుంచి. ఈ సినిమా ప్రోమో రిలీజైనపుడే ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అర్థమైపోయింది. ఇక పాట అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉండటం.. లిరికల్ వీడియోను చాలా రిచ్‌గా తీర్చిదిద్దడంతో చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఎంతో శ్రావ్యంగా ఆలపించాడు.
కాకపోతే తెలుగు పదాలను ఖూనీ చేశాడన్న విమర్శ మాత్రం ఉంది. ఆ ఒక్క కంప్లైంట్ పక్కన పెడితే పాట మాత్రం సూపర్ హిట్ అనడంలో సందేహం లేదు. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తున్నట్లే కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 1.6 కోట్ల వ్యూస్, 8 లక్షల లైక్స్ వచ్చాయి ఈ పాటకు. ఇది ఆల్ ఇండియా రికార్డ్ కావడం విశేషం. మహేష్ బాబు-కీర్తి సురేష్-తమన్-సిద్ శ్రీరామ్-మైత్రీ మూవీ మేకర్స్-పరశురామ్.. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ రికార్డు గురించి మరీ ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.
కాకపోతే ఈ రికార్డు కోసం మైత్రీ వాళ్లకు డబ్బులు ఖర్చయ్యాయంటూ ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం. పెయిడ్ ప్రమోషన్లతో దీనికి వ్యూస్, లైక్స్ పెంచినట్లుగా కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వ్యూస్, లైక్స్ బ్రేకప్స్‌తో ఇందుకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు.
మధ్య మధ్యలో వ్యూస్, లైక్స్ అనూహ్యంగా పెరిగాయని.. ఆరంభంలో కంటే తర్వాత లైక్స్, వ్యూస్ ఎక్కువ కావడం వెనుక కారణాలు వేరే ఉన్నాయని.. పనిగట్టుకుని వీటిని పెంచడానికి డబ్బులు ఖర్చు చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐతే బేసిగ్గానే పెద్ద హిట్టయ్యే స్కోప్ ఉన్న ఈ పాటకు ఇలా పనిగట్టుకుని వ్యూస్, లైక్స్ పెంచడానికి ప్రయత్నించారంటే ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఇలా చేసింది నిజమే అయితే.. అదంతా అవసరమా అన్నది ప్రశ్న.
This post was last modified on February 15, 2022 9:55 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…