సత్యదేవ్ అనగానే మెచ్యూర్డ్ యాక్టింగే కాదు.. సీరియస్ సబ్జెక్ట్స్ కూడా గుర్తొస్తాయి. అయితే ఈసారి కాస్త భిన్నంగా ఓ ప్రేమకథలో కనిపించబోతున్నాడు తను. అదే విశేషమంటే అతనికి జంటగా తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ నటించడం మరో పెద్ద విశేషం.
వేలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. ఓ ఫ్రెష్ ఫీల్‌ని తీసుకొచ్చింది. తన జీవితంలోని ప్రేమకథలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాడు సత్య. చిన్నప్పటి నుంచి ఎంతమంది అమ్మాయిలు తన లైఫ్‌లోకి వచ్చారో కౌంట్ చేసుకున్నాడు. ప్రతి శీతాకాలంలోనూ తన మనసులో చిగురించిన కొత్త ప్రేమ గురించి నెమరు వేసుకుంటున్నాడు.
ఫైనల్‌గా తనను కలిసిన తమన్నా అందరి లాంటిది కాదని, ఆమె చాలా డిఫరెంట్ అని చెప్పిన సత్య.. వీళ్లందరిలో ఎవరిని లైఫ్ పార్ట్నర్‌ని చేసుకోవాలా అనే డైలమాలో ఉన్నాడు. గంభీరమైన స్వరంతో అతను ఇచ్చిన వాయిస్ ఓవర్.. సత్యతో పాటు అందమైన హీరోయిన్ల విజువల్స్.. బ్యాగ్రౌండ్‌లో కాలభైరవ సూతింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ కలిసి ఈ ట్రైలర్‌ని స్పెషల్‌గా మార్చేశాయి. ఈ శీతాలపు ప్రేమ సమ్‌థింగ్ డిఫరెంట్ అనే భావనను కలిగించాయి.
తమన్నాతో పాటు మేఘా ఆకాష్, కావ్యాశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్.నాగశేఖర్ దర్శకుడు. భావనా రవి, రామారావ్ చింతపల్లితో కలిసి దర్శకుడే నిర్మిస్తున్నాడు. ట్రైలర్‌లో ఉన్న ఫీల్ సినిమా అంతా క్యారీ అయితే.. సత్యదేవ్, తమన్నాల అకౌంట్‌లో ఓ హిట్టు పడుతుంది. ప్రేక్షకులకు ఓ మంచి ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ చూసిన అనుభూతి దక్కుతుంది.
This post was last modified on February 14, 2022 4:45 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…