నాగార్జునను వెనక్కి నెట్టేసిన సిద్ధు

ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజైన సినిమాల్లో అత్యంత పెద్దది అంటే ‘బంగార్రాజు’నే. అందులో అక్కినేని నాగార్జున, నాగచైతన్య లాంటి స్టార్ హీరోలు కలిసి నటించారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ఆ చిత్రం. కాస్ట్ అండ్ క్రూ.. బడ్జెట్ పరంగా చూస్తే అది కాస్త పెద్ద స్థాయి సినిమానే. అందులోనూ అది సంక్రాంతి సీజన్లో రిలీజైంది. మొన్నటిదాకా 2022 సంవత్సరానికి హైయెస్ట్ రికార్డులన్నీ ఆ సినిమా పేరిటే ఉన్నాయి.

తొలి రోజు వసూళ్లు, యుఎస్ ప్రిమియర్స్.. ఇలా అన్నింట్లోనూ ‘బంగార్రాజు’దే ఆధిపత్యం. ఐతే మొన్న రవితేజ సినిమా ‘ఖిలాడి’ తొలి రోజు ‘బంగార్రాజు’ను మించి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ యుఎస్‌లో ఆ సినిమాకు ప్రిమియర్సే వేయలేదు. సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ రావడం వల్ల తొలి రోజు సాయంత్రానికే వసూళ్లు పడిపోయాయి. ఐతే తర్వాతి రోజు వచ్చిన చిన్న సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ లీడర్‌గా మారడం విశేషం.

ఆ చిత్రమే.. డీజే టిల్లు.సిద్ధు జొన్నలగడ్డ అనే చిన్న హీరో నటించిన ఈ చిత్రానికి ‘బంగార్రాజు’ను మించి ఓపెనింగ్స్ రావడం విశేషం. యుఎస్ ప్రిమియర్స్‌లో కూడా ‘బంగార్రాజు’ను ‘డీజే టిల్లు’ దాటేయడం విశేషం. ప్రిమియర్లతోనే ‘డీజే టిల్లు’ వంద డాలర్లకు పైగా కొల్లగొట్టింది. అంతే కాక శనివారం కూడా లక్ష డాలర్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం కూడా అంతే దీటుగా వసూళ్లు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం తొలి రోజు రూ.3 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం.

ఒక్క తెలంగాణలోనే ‘డీజే టిల్లు’ రూ.1.5 కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద మొత్తమే. ‘ఖిలాడి’కి ప్రి రిలీజ్ బజ్ వల్ల, పెద్ద సినిమా కావడం వల్ల తొలి రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి కానీ.. ఆ తర్వాత ‘డీజే టిల్లు’ దెబ్బకు అది తట్టుకునేలా కనిపించడం లేదు. శనివారం ‘ఖిలాడి’ జోరు తగ్గిపోగా.. ‘డీజే టిల్లు’ హౌస్ ఫుల్ వసూళ్లతో నడిచింది. ఆదివారం కూడా ప్యాక్డ్ హౌసెస్‌తో రన్ అవుతోంది ‘డీజే టిల్లు’. ఫుల్ రన్లో ఈ సినిమా ఈజీగా రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.