తెలుగమ్మాయి డింపుల్ హయతి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది. వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన డింపుల్ ఆ తరువాత హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాలో డింపుల్ హయతి గ్లామర్ షోకి అందరూ ఫిదా అయ్యారు. అవసరానికి మించి మరీ ఎక్స్ పోజ్ చేసి యూత్ ని ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఒక హీరోయిన్ ప్రమోషన్స్ కోసం ఈ రేంజ్ లో స్కిన్ షో చేయడం హాట్ టాపిక్ అయింది.
అయితే ఇప్పుడు తన గ్లామర్ తోనే మరిన్ని అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ. అందుతున్న సమాచారం ప్రకారం.. డింపుల్ హయతికి హీరోయిన్ గా మరో అవకాశం వచ్చింది. గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ రూపొందిస్తోన్న సినిమాలో డింపుల్ హయతిని హీరోయిన్ గా తీసుకున్నారట.
రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందించనున్నారు. ప్రస్తుతం గోపీచంద్.. మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు.
This post was last modified on February 12, 2022 6:52 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…