కొత్త కాన్సెప్టులు, వెరైటీ క్యారెక్టర్ల కోసం భూతద్దం వేసి వెతుకుతుంటాడు ధనుష్. పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉంటే ఏ ప్రయోగమైనా చేయడానికి రెడీ అవుతాడు. ప్రస్తుతం ఒకదానితో ఒకటి సంబంధం లేని ఆరు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ‘నానే వరువేన్’ ఒకటి. సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీలో ధనుష్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. నిన్న తన రెండు లుక్స్‌నీ రివీల్ చేశారు. రెండు డిఫరెంట్ లుక్స్‌లో సూపర్బ్‌గా ఉన్నాడు ధనుష్. ఒక లుక్‌లో తల నున్నగా దువ్వి, కళ్లజోడు పెట్టి, అక్కడక్కడా మెరిసిన గడ్డంతో మెచ్యూర్డ్ మేన్‌గా కనిపిస్తున్నాడు. మరో గెటప్‌లో షార్ట్‌గా కత్తిరించి డై వేసిన జుట్టు, క్లీన్ షేవ్‌తో యంగ్‌గా ఉన్నాడు.
మొత్తానికి రెండు లుక్స్‌తోనూ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ధనుష్, సెల్వ రాఘవన్‌ల కాంబినేషన్‌లో ఇప్పటికే కొన్ని సినిమాలు రావడంతో ఈ చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఇప్పుడు ధనుష్ లుక్స్ చూశాక అవి మరింత పెరిగాయి.
ఇందుజ రవిచందర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు ఓ కీలక పాత్ర పోసిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్‌గా కొత్త షెడ్యూల్ స్టార్టయ్యింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఇయర్ ఎండింగ్‌లోపు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on February 12, 2022 8:24 am
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…