సరిగ్గా పాతికేళ్ల క్రితం…
ఇదే రోజు..
రెండు సినిమాలు విడుదలయ్యాయి.
ఒకటి మెగాస్టార్ చిరంజీవిదైతే, మరోటి కలక్షన్‌కింగ్ మోహన్‌బాబుది. నిజానికి చిరు, మోహన్‌బాబు సినిమాలు ఒకేరోజు తలపడితే – ప్రేక్షకులు, చిత్రసీమ దృష్టి చిరు సినిమాపైనే ఉంటుంది. ఆ రోజూ అంతే. తొలిరోజు చిరుదే హవా. రెండోరోజు నుంచి పరిస్థితులు మారిపోయాయి. చిరంజీవి థియేటర్లో ఈగ కూడా లేదు.
మోహన్ బాబు సినిమా ఆడుతున్న థియేటర్లో ఈగ కూడా చొరబడడానికి చోటు లేదు. అలా మారిపోయాయి. చిరు సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయితే, మోహన్ బాబు సినిమా సూపర్ హిట్టయ్యింది. రెండు సినిమాలే ‘బిగ్ బాస్’, ‘పెదరాయుడు’.
చిరంజీవి – రోజా కాంబోలో రెడీ అయిన సినిమా ‘బిగ్ బాస్’. ‘గ్యాంగ్ లీడర్’లా ఈసినిమా దుమ్మురేపుతుందని అంతా ఆశించారు. ‘బాస్.. బిగ్ బాస్’ అంటూ చిరు హడావుడి చేస్తే బాక్సాఫీసు ఊగిపోతుందని అనుకున్నారు. పైగా పాటల్నీ మాస్‌ని ఆకట్టుకున్నాయి.
‘పెదరాయుడు’కి రిలీజ్ ముందు పెద్దగా బజ్ లేదు. పైగా ఆ తరహా సినిమాలు బాక్సాఫీసుకి బాగా కొత్త. దానికి తోడు మోహన్ బాబు వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలూ ఒకేసారి విడుదలవ్వడం, ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ… చిరు సినిమా ఫ్లాప్ అయి, మోహన్ బాబు సినిమా సిల్వర్ జూబ్లీ ఆడడం చిత్రసీమకు షాక్ ఇచ్చాయి.
‘పెదరాయుడు’ మోహన్ బాబు కెరీర్‌లో మైల్ స్టోన్ అయితే, బిగ్ బాస్ చిరు అభిమానులకు పీడకలలా మారిపోయింది. ఆ తరవాత చిరు, మోహన్ బాబుల సినిమాలు ఎప్పుడూ ఒకే రోజు విడుదల కాలేదు. అంతకు మించిన హిట్టు మోహన్ బాబు కూడా అందుకోలేదు. అదీ… ఈ రెండు సినిమాల కథ.
This post was last modified on June 15, 2020 3:47 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…