ఇంతవరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన శివకార్తికేయన్.. ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలోనే నటిస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిటయ్యాడు. అనౌన్స్‌మెంట్ వచ్చి కూడా చాలా రోజులైంది. ఇప్పుడీ మూవీ గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది.
నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ మూవీని నిన్న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దర్శక నిర్మాతలు, హీరోతో పాటు సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నారు. ‘ఎంటర్‌టైనింగ్ జర్నీ మొదలైంది.
తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమా కరైకుడిలో అధికారింగా స్టార్టయ్యింది’ అంటూ టీమ్ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇవాళ్టి నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. హీరోతో పాటు కొందరు మెయిన్ యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.
కూల్ కంటెంట్‌కి, యాక్షన్ పార్ట్‌ని మిక్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు శివకార్తికేయన్. ఇక అనుదీప్ తొలి సినిమాతో ఫుల్ లెంగ్త్ కామెడీని పండించి మెప్పించాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా తయారవుతుందో చూడాలి.
This post was last modified on February 10, 2022 5:38 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…