శత్రువు, దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లతో ఒకప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు ఎమ్మెస్ రాజు. ఆయన పేరులోని ఎం, ఎస్ అక్షరాలకు మెగా సక్సెస్ అన్న అబ్రివేషన్ కూడా ఇచ్చేవారు అప్పట్లో. ఐతే తనకున్న పేరును ఆ తర్వాతి కాలంలో ఆయన నిలబెట్టుకోలేకపోయాడు.
వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయాడు. ఐతే చాలా గ్యాప్ తర్వాత 2020లో ఆయన్నుంచి డర్టీ హరి అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కాదు.. దర్శకుడు కావడం విశేషం. అంతకుముందు తీసిన వాన, తూనీగ తూనీగ చిత్రాలకు ఆయనకు నిరాశను మిగల్చగా.. డర్టీ హరి మాత్రం మంచి ఫలితాన్నే అందించింది. అందులో బోల్డ్ సీన్లు చూసి అంతా అవాక్కయ్యారు. ఓటీటీలో రిలీజై యువ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది డర్టీ హరి.
ఈ సినిమాతో సక్సెస్ ఫార్ములాను మళ్లీ పట్టేసినట్లు కనిపించిన రాజు.. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అనే సినిమాతో రాబోతున్నాడు. సంక్రాంతికే అనుకున్న ఈ చిత్రం వాయిదా పడింది. ఈ నెలలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు. టైటిల్‌కు తగ్గట్లే ఇది పక్కా రొమాంటిక్ మూవీ అనేది ట్రైలర్లో స్పష్టంగా తెలిసిపోయింది.
ఆరంభం నుంచి చివరిదాకా చర్చంతా రొమాన్స్ గురించే. గోవా ట్రిప్‌కు వెళ్లి అక్కడ అమ్మాయిలతో సయ్యాటలు ఆడే ఇద్దరబ్బాయిల కథ ఇది. అమ్మాయిల అందాలు.. ఇంటిమేట్ సీన్లు.. కొన్ని బోల్డ్ డైలాగ్స్.. ట్రైలరంతా ఇదే వరస. డర్టీ హరిలో మాదిరి క్రైమ్ ఎలిమెంట్ కూడా ఏమీ కనిపించడం లేదిందులో. కథ పరంగా ఆసక్తి రేకెత్తించే అంశాలేమీ ట్రైలర్లో లేవు. కేవలం రొమాన్స్ కోసమైతే ఈ సినిమా చూడొచ్చు. అంతకుమించి రాజు గారు ఆఫర్ చేస్తున్నదేమీ లేదు.
This post was last modified on February 10, 2022 7:43 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…