రాహుల్ రామకృష్ణ.. ప్రస్తుత తరం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన కమెడియన్లలో ఒకడు. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సటిల్ కామెడీతో ఆకట్టుకుంటాడతను. కేవలం కామెడీకి పరిమితం కాకుండా అప్పుడప్పుడూ సీరియస్ పాత్రలతోనూ అలరించే అతను.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటాడు. ఐతే అక్కడ అతను తరచుగా వివాదాల్లో చిక్కుకునేలా పోస్టులు పెట్టడమే ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శిస్తూ అతను పెట్టే పోస్టులకు ఓ వర్గం నుంచి మద్దతు లభిస్తుంటుంది. ఇంకో వర్గం నెటిజన్లు అతడి మీద విరుచుకుపడుతుంటారు. రాజకీయాలే కాక వేరే అంశాల మీదా రాహుల్ స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. ఐతే తన ఫాలోవర్లను అప్పుడప్పుడు గిచ్చేటట్లు అతను పోస్టులు పెడుతుంటాడు.
ఈ మధ్య అలాగే తాను ఈ ఏడాది వరకే సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత రిటైరవుతానని పెట్టిన పోస్టు చిన్నపాటి సంచలనం రేపింది.ఇది జస్ట్ జోక్ అని చెబుతూ, దీన్ని నమ్మిన వాళ్లను ఫూల్స్‌కు అభివర్ణిస్తూ అతను తర్వాతి రోజు పెట్టిన పోస్టుపై నెటిజన్లు భగ్గుమన్నారు. రాహుల్‌ను అభిమానించే వాళ్లు ఈ పోస్టుతో బాగా హర్టయ్యారు. దీనిపై తీవ్ర విమర్శలే వ్యక్తమయ్యాయి. కానీ రాహుల్ ఈ విషయంలో పెద్దగా ఫీలైనట్లు లేడు.
తాజాగా తన ఫాలోవర్లతో ఒక చిట్ చాట్ పెట్టిన రాహుల్.. మీకు కొంచెం తిక్క కదా అని ఒక నెటిజన్ అంటే కొంచెం కాదు.. చాలా ఎక్కువ అని బదులివ్వడం విశేషం. అంతే కాదు.. తన మీద పెట్టిన ఒక నెగెటివ్ మీమ్‌ను సైతం అతను షేర్ చేశాడు. ‘జల్సా’ సినిమాలో ధర్మవరం దగ్గరికి గుండు హనుమంతరావు తన కూతురిని ట్రీట్మెంట్ తీసుకురావడం.. ఆమె టీ ధర్మవరం మొహాన కొట్టడం.. ఈ సీన్ గుర్తుందికదా. ఇలా జరిగాక అమ్మాయి కొంచెం తేడా అని గుండు అంటే.. ‘‘పిచ్చంటారండీ దీన్ని’’ అంటాడు కోపంగా ధర్మవరం. ఈ సన్నివేశానికి రాహుల్ రిటైర్మెంట్ జోక్‌కు అన్వయిస్తూ.. దీన్ని పిచ్చంటారు ఎవరో ఒక మీమ్ తయారు చేశారు. దీన్ని రాహుల్ షేర్ చేసి.. కరెక్టుగా కనిపెట్టారు అన్నట్లు కామెంట్ పెట్టడం గమనార్హం. ఇది చూసి రాహుల్ రూటే వేరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on February 9, 2022 6:38 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…