టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గానే ‘బీస్ట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. హిందీలో రణవీర్ సింగ్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది.
తెలుగులో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పూజా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతుందని సమాచారం. నిజానికి రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో ఓ సినిమాను ప్రకటించారు. దానికి ‘కబీ ఈద్ కబీ దివాలి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై కూడా పూజా సైన్ చేసింది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిర్మాత సాజిద్ నడియాద్వాలా సినిమా టైటిల్ ను ‘భాయ్ జాన్’గా మార్చారట. మార్చి 15 నుంచి ముంబైలో షూటింగ్ మొదలుకానుంది.
ఇందులో సల్మాన్ కి జోడీగా పూజా కనిపించనుంది. ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారట. ఆయన సరసన సౌత్ హీరోయిన్ కనిపించనుందని సమాచారం. పూజా, వెంకీ లాంటి స్టార్లు నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా బజ్ క్రియేట్ అయింది.
This post was last modified on February 8, 2022 8:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…