ఒకప్పుడు కమల్ హాసన్ సినిమాల్లో లిప్ లాక్స్ సీన్లు చూసి అందరూ తెగ ఆశ్చర్యపోయేవారు. మరీ అంత శ్రుతి మించిపోవడమేంటి.. అంత ఘాటు ముద్దులు అవసరమా అనే వాళ్లు చాలామంది. ‘హే రామ్’ లాంటి సినిమాల్లో మిగతా విషయాలన్నీ వదిలేసి లిప్ లాక్స్ గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. కానీ 2000 తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. బాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్స్ సర్వ సాధారణం అయిపోయాయి.
ఇంటిమేట్ సీన్లు ఎలా హద్దులు దాటేశాయో తెలిసిందే. సౌత్ సినిమా ఈ విషయంలో కొంత వెనుబడే ఉన్నప్పటికీ గత దశాబ్దంలో ఇక్కడ కూడా పరిస్థితులు మారాయి. దక్షిణాది సినిమాల్లో కూడా లిప్ లాక్స్ మామూలైపోయాయి. అయినప్పటికీ స్టార్ హీరోలు, ముఖ్యంగా సీనియర్లు పెదవి ముద్దుల విషయంలో ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. యువ కథానాయకుల్లా వాళ్లలో లిప్ లాక్స్ చేసేటపుడు ఈజ్ కనిపించడం లేదు.
ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తొలిసారి ‘తీన్ మార్’ కోసం త్రిషతో చిన్న లిప్ లాక్ చేశాడు. కానీ ఆ సన్నివేశం గమనిస్తే పవన్ అసౌకర్యంగా ఉన్న విషయం అర్థమైపోతుంది. చూసే ప్రేక్షకులకు కూడా అది కొంచెం ఎబ్బెట్టుగానే అనిపించింది. హీరోయిన్లతో సినిమాల్లో, బయట అంటీ ముట్టనట్లుగా ఉండే పవన్.. లిప్ లాక్ చేయడాన్ని ఆయన అభిమానులే అంతగా జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు మరో సీనియర్ హీరో రవితేజ చేసిన లిప్ లాక్ అయితే అంతకంటే ఎబ్బెట్టుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెరీర్లో ఇప్పటిదాకా ఏ కథానాయికతోనూ పెదవి ముద్దుకు వెళ్లని మాస్ రాజా.. తొలిసారి ‘ఖిలాడి’ మూవీలో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరితో లిప్ లాక్ చేసిన విషయం ట్రైలర్లో కనిపించింది.
ఆ ముద్దు కొంచెం ఘాటుగానే అనిపిస్తోంది. ఐతే మీనాక్షి లాంటి యంగ్ హీరోయిన్‌తో సరైన కెమిస్ట్రీ లేకుండా రవితేజ లాంటి సీనియర్ లిప్ లాక్ చేయడం చూసి జనాలు నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. రవితేజకు ఎప్పుడూ రొమాంటిక్ ఇమేజ్ అయితే లేదు. ఆయనో మాస్, యాక్షన్ హీరో. సీనియర్ అయినా సరే.. నాగార్జున లాంటి రొమాంటిక్ హీరో అయితే ఓకే కానీ.. మాస్ రాజాకైతే లిప్ లాక్ అస్సలు సెట్ కాలేదనే అంటున్నారంతా. ఆయనకు ఈ వయసులో ఇలాంటివి అవసరమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికి సీనియర్ హీరోలు లిప్ లాక్స్‌కు దూరంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయం మెజారిటీ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.
This post was last modified on February 8, 2022 5:41 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…