జె.కె.భారవి.. ‘అన్నమయ్య’ లాంటి ఆల్ టైం క్లాసిక్‌కు కథ, మాటలు అందించి గొప్ప పేరు సంపాదించిన రచయిత. ఆ తర్వాత ఆయన రచనలో వచ్చిన ‘శ్రీరామదాసు’ సైతం ఘనవిజయాన్నందుకుంది. ఆయనకు తెలుగు సినిమా చరిత్రలో ఈ రెండు చిత్రాలు ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చిపెట్టాయి. ఇవి కాక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ మంజునాథ, పాండు రంగడు, షిరిడి సాయి, శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం లాంటి ఆధ్యాత్మిక చిత్రాలకు సైతం భారవి రచన చేశారు.
ఇవి కాక ‘శక్తి’ సహా కొన్ని కమర్షియల్ సినిమాలకు కూడా ఆయన స్క్రిప్టు విభాగంలో పని చేశారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసిన భారవి.. చివరగా స్వీయ దర్శకత్వంలో ‘జగద్గురు ఆది శంకరాచార్య’ అనే సినిమా తీశారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడా. ప్రముఖ తారాగణాన్ని పెట్టుకుని పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీశారు భారవి. ఐతే ఈ సినిమా ఆయకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
తాజాగా ఒక మీడియా సంస్థకు భారవి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఆదిశంకరాచార్య’ తర్వాత కనుమరుగైపోవడానికి కారణాలేంటో ఆయన వివరించారు. అంతకుముందు చేసిన సినిమాలతో తాను బాగానే సంపాదించానని.. కానీ ఈ ఒక్క సినిమా తనను దాదాపుగా రోడ్డు మీదికి తీసుకొచ్చేసిందని అన్నారు భారవి. ఈ సినిమా మీద పెట్టిన డబ్బులన్నీ పోయాయని.. ఎన్నో కార్లు చూసిన తాను ఇప్పుడు ఇంటర్వ్యూలో బైక్ వేసుకుని రావాల్సి వచ్చిందని భారవి వివరించారు.
తన రచనలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి గొప్ప సినిమాల్లో నటించిన నాగార్జునకు తన పరిస్థితి తెలిస్తే కచ్చితంగా ఆర్థిక సాయం చేస్తారని.. కానీ ఎవరినీ సాయం అడగడం తనకు ఇష్టముండదని., అందుకే సైలెంటుగా ఉన్నానని చెప్పారు భారవి. ప్రస్తుతం తాను కొన్ని సినిమాలకు పని చేస్తున్నానని.. ఐతే గత సినిమాల ప్రభావం, కరోనా కారణంగాసరిగా పారితోషకాలు అందట్లేదని.. అందుకే ఇబ్బంది పడుతున్నానని చెప్పారాయన.
This post was last modified on February 8, 2022 4:12 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…