గత కొన్నేళ్లలో బాలీవుడ్లో మిగతా స్టార్లను వెనక్కి నెట్టి ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు ఖాన్ త్రయం ముందు ఎవరూ నిలవగలిగేవారు కాదు కానీ.. అక్షయ్ వరుస హిట్లు కొట్టడం.. అలాగే వేగంగా సినిమాలు చేయడం ద్వారా వాళ్లను దాటి ముందుకెళ్లిపోయాడు.
వార్షికాదాయం, సక్సెస్ రేట్ లెక్కల్లో చూస్తే బాలీవుడ్లో అక్షయే నంబర్ వన్ హీరో. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో, ప్రధాని నరేంద్ర మోడీతో అక్షయ్‌కి ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా తెలిసిందే. బాలీవుడ్లో చాలా కొద్దిమంది భాజపా అనుకూల హీరోల్లో అక్షయ్ ఒకడు. అలాంటి అక్షయ్ ఆ మధ్య కపిల్ శర్మ నిర్వహించే కామెడీ షోకు వెళ్లి సరదాగా మాట్లాడుతూ.. అనుకోకుండా బీజేపీ మీద ఒక జోక్ పేల్చాడు.
ఐతే షూట్ టైంలో తర్వాత విషయం గుర్తించి ఆ జోక్‌ను ఎపిసోడ్ నుంచి తీసేయాలని కపిల్ అండ్ కోను అడిగాడట.కానీ అక్షయ్‌కి ఓకే చెప్పి.. షోలో మాత్రం ఆ జోక్‌ను అలాగే ఉంచేశారు. అది ప్రసారం అయిపోయింది. భాజపా మద్దతుదారుగా ఉన్న అక్షయ్.. అదే పార్టీ మీద జోక్ పేల్చడంతో ఇరుకున పడ్డాడు. ఇది అతణ్ని బాగా హర్ట్ చేసింది. షో నిర్వాహకులపై సీరియస్ అయిన అక్షయ్.. కపిల్ షోను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కొన్నేళ్లుగా తన ప్రతి సినిమా ప్రమోషన్‌కూ కపిల్ షోకు వెళ్తున్నాడు అక్షయ్. దాదాపుగా బాలీవుడ్లో ప్రతి పెద్ద సినిమానూ ఈ షోలో ప్రమోట్ చేస్తారు. ఐతే ఇకపై అక్షయ్ ఆ షోకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడట. వచ్చే నెలలో విడుదల కావాల్సిన తన కొత్త చిత్రం బచ్చన్ పాండేన రిలీజ్ టైంలో ఈ షోకు రావాలని అడిగినప్పటికీ.. నో చెప్పేశాడట. తన మాట మన్నించనందుకు అతను బాగానే హర్టయినట్లు తెలుస్తోంది. ‘బచ్చన్ పాండే’ తెలుగులో ‘కాటమరాయుడు’గా రీమేక్ అయిన తమిళ చిత్రం ‘వీరం’కు రీమేక్ కావడం విశేషం.
This post was last modified on February 8, 2022 2:20 pm
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…